వహ్వా.. ఐఆర్‌సీటీసీ లిస్టింగ్‌

వహ్వా.. ఐఆర్‌సీటీసీ లిస్టింగ్‌

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) బంపర్‌ లిస్టింగ్‌ సాధించింది. ఇష్యూ ధర రూ. 320కాగా..  బీఎస్‌ఈలో 103 శాతం ప్రీమియంతో రూ. 651 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. వెరసి రూ. 331 వద్ద లాభంతో లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో ఈ నెల 3న ముగిసిన ఇష్యూ ఏకంగా 111 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ సాధించింది. ప్రభుత్వం 12.6 శాతం వాటాకు సమానమైన 2.01 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 225 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్‌ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా.. రూ. 645 కోట్ల ఇష్యూలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ధరలో రూ. 10 డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది. 2018 నుంచి చూస్తే.. రైల్వే రంగ కంపెనీలలో రైట్స్‌(RITES), రైల్‌ వికాస్‌ నిగమ్‌, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ఇప్పటికే లిస్టయ్యాయి. ఈ బాటలో ఐఆర్‌సీటీసీ నాలుగో కంపెనీగా నిలవనుంది.

కంపెనీ వివరాలు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ(సీపీఎస్‌ఈ) ఐఆర్‌సీటీసీ. రైల్వే శాఖ నిర్వహణలో నడుస్తోంది. ఇష్యూకి ముందు ప్రభుత్వం 100 శాతం వాటాను కలిగి ఉంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్న కంపెనీగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ప్రసిద్ధిచెందింది. నెలకు సగటున 25-28 మిలియన్‌ లావాదేవీలు నమోదవుతున్నాయి. ప్రధానంగా నాలుగు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఆదాయంలో ఇంటర్నెట్‌ టికెటింగ్ ద్వారా 12 శాతం లభిస్తుండగా, కేటరింగ్‌ బిజినెస్‌ ద్వారా 55 శాతం సాధిస్తోంది. ఈ బాటలో ప్యాకేజ్‌డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌(రైల్‌ నీర్‌) విభాగం 10 శాతం, ట్రావెల్‌, టూరిజం నుంచి 23 శాతం ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. 



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');