హుషారుగా మొదలై- ఐటీ డౌన్

హుషారుగా మొదలై- ఐటీ డౌన్

వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ అమెరికా, చైనా పాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. వారాంతాన ప్రపంచ మార్కెట్లు జోరందుకోగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించింది. దీంతో తొలుత సెన్సెక్స్‌ 150 పాయింట్ల వరకూ ఎగసింది. 38,287 వద్ద గరిష్టాన్ని తాకింది. తదుపరి ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో నష్టాలలోకి సైతం ప్రవేశించింది. 38,098 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం 82 పాయింట్లు జమచేసుకుని 38,203 వద్ద ట్రేడవుతోంది. ఇక తొలుత 11,352 వరకూ పెరిగిన నిఫ్టీ ప్రస్తుతం 26 పాయింట్లు బలపడి 11,331 వద్ద ట్రేడవుతోంది. 

మెటల్‌, ఫార్మా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌ 1 శాతం, ఫార్మా, రియల్టీ 0.5 శాతం చొప్పున పుంజుకోగా.. ఐటీ 1 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, వేదాంతా, ఐవోసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ 4-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఇన్ఫోసిస్‌, యూపీఎల్‌, టీసీఎస్‌, జీ, హీరో మోటో, ఎంఅండ్‌ఎం, టెక్‌ మహీంద్రా 3-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

ఐబీ హౌసింగ్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో టాటా మోటార్స్‌ డీవీఆర్‌, డీఎల్‌ఎఫ్‌, ఎన్‌ఎండీసీ, జిందాల్‌ స్టీల్‌, ఆర్‌ఈసీ, భారత్‌ ఫోర్జ్‌ 4-2 శాతం మధ్య జంప్‌చేయగా.. ఐబీ హౌసింగ్‌, 5 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో బీవోబీ, గ్లెన్‌మార్క్‌, హెక్సావేర్‌, ఎన్‌సీసీ, డిష్‌ టీవీ, నిట్‌ టెక్‌ 2-1 శాతం మధ్య క్షీణించాయి.

చిన్న షేర్లు ఓకే
మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నప్పటికీ మధ్య, చిన్నతరహా కౌంటర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 0.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ 673 షేర్లు లాభపడగా.. 510 నష్టాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో అదానీ గ్యాస్‌, బిర్లాసాఫ్ట్‌, ఎఫ్‌ఈఎల్‌, విండ్‌సర్‌, సింప్లెక్స్‌, నితిన్‌, ఈకేసీ, దివాన్‌ హౌసింగ్‌, ఐబీ రియల్టీ తదితరాలు 12-5 శాతం మధ్య జంప్‌చేశాయి.