రుపీ.. ఖుషీ

రుపీ.. ఖుషీ

అగ్రదేశాల మధ్య పాక్షిక డీల్‌ కుదరనున్న అంచనాలతో వారాంతాన స్వల్ప లాభంతో సరిపెట్టుకున్న దేశీ కరెన్సీ హుషారుగా ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 19 పైసలు(0.27 శాతం) ఎగసి 70.83 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. ప్రస్తుతం మరికొంత పుంజుకుంది. 26 పైసలు లాభపడి 70.76 వద్ద ట్రేడవుతోంది. కాగా.. మూడు రోజులుగా కన్సాలిడేషన్‌ బాటలో కదులుతున్న రూపాయి శుక్రవారం స్వల్పంగా 5 పైసలు  బలపడింది. 71.02 వద్ద ముగిసింది. అయితే అంతక్రితం రెండు రోజుల్లో స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదిలిన దేశీ కరెన్సీ శుక్రవారం ట్రేడింగ్‌లో తొలుత జోరందుకుంది. డాలరుతో మారకంలో 20 పైసలు(0.28 శాతం) ఎగసి 70.87 వద్ద ప్రారంభమైంది. తదుపరి 70.82 వరకూ పుంజుకున్నప్పటికీ మిడ్‌సెషన్‌లో ఇరానియన్‌ చమురు ట్యాంకర్‌పై దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో అటు స్టాక్‌ మార్కెట్లతోపాటు.. ఇటు రూపాయి సైతం ఉన్నట్టుండి బలహీనపడింది. వెరసి శుక్రవారం ఇంట్రాడేలో 71.08 వరకూ నీరసించింది. చివరికి 71.02 వద్ద స్థిరపడింది. వారాంతాన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా పాక్షిక డీల్‌ కుదిరే అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడిన విషయం విదితమే. దీంతో అంతర్జాతీయ స్థాయిలో స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. దేశీయంగానూ సెన్సెక్స్ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. ఇది రూపాయికి సైతం ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా..  వారం మొత్తంగా చూస్తే.. రూపాయి 14 పైసలు నష్టపోవడం గమనార్హం.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
గత మూడు నెలలుగా పెట్టుబడులను వెనక్కి  తీసుకుంటున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెల(అక్టోబర్‌)లోనూ దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గత రెండు వారాలలో దేశీ కేపిటల్‌ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 6200 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈక్విటీ విభాగంలో రూ. 4955 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. రూ. 1262 కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలనూ విక్రయించారు. వెరసి ఈ నెల 1-11 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 6200 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');