ఐఆర్‌సీటీసీ.. బంపర్‌ లిస్టింగ్‌?

ఐఆర్‌సీటీసీ.. బంపర్‌ లిస్టింగ్‌?

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) నేడు(14న) లిస్ట్‌కానుంది. కంపెనీ చేపట్టిన పబ్లిక్‌ ఇష్యూకి ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో అనధికార మార్కెట్లో(గ్రే మార్కెట్‌) భారీ ప్రీమియం పలుకుతోంది. ఇష్యూ ధర రూ. 320కాగా.. 56 శాతం ప్రీమియంతో రూ. 500 ధర పలుకుతున్నట్లు మార్కెట్‌వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే లిస్టింగ్‌ సమయంలో మార్కెట్లో నెలకొనే సెంటిమెంటు ఆధారంగా ఈ కౌంటర్లో ట్రేడింగ్‌ ప్రారంభంకావచ్చని చెబుతున్నారు. ఈ నెల 3న ముగిసిన ఇష్యూ ఏకంగా 111 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ సాధించింది. రూ. 645 కోట్ల ఇష్యూలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ధరలో రూ. 10 డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వం 12.6 శాతం వాటాకు సమానమైన 2.01 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 225 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్‌ దాఖలైన సంగతి తెలిసిందే. 2018 నుంచి చూస్తే.. రైల్వే రంగ కంపెనీలలో రైట్స్‌(RITES), రైల్‌ వికాస్‌ నిగమ్‌, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ఇప్పటికే లిస్టయ్యాయి. ఈ బాటలో ఐఆర్‌సీటీసీ నాలుగో కంపెనీగా నిలవనుంది.

కంపెనీ వివరాలు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ(సీపీఎస్‌ఈ) ఐఆర్‌సీటీసీ. రైల్వే శాఖ నిర్వహణలో నడుస్తోంది. ఇష్యూకి ముందు ప్రభుత్వం 100 శాతం వాటాను కలిగి ఉంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్న కంపెనీగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ప్రసిద్ధిచెందింది. నెలకు సగటున 25-28 మిలియన్‌ లావాదేవీలు నమోదవుతున్నాయి. ప్రధానంగా నాలుగు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఆదాయంలో ఇంటర్నెట్‌ టికెటింగ్ ద్వారా 12 శాతం లభిస్తుండగా, కేటరింగ్‌ బిజినెస్‌ ద్వారా 55 శాతం సాధిస్తోంది. ఈ బాటలో ప్యాకేజ్‌డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌(రైల్‌ నీర్‌) విభాగం 10 శాతం, ట్రావెల్‌, టూరిజం నుంచి 23 శాతం ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. 



Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');