ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,306 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అయితే అత్యున్నత ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలలో భాగంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి పాక్షిక డీల్‌ కుదిరినట్లు వెల్లడించడంతో శుక్రవారం యూరప్‌, అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా  ట్రేడయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 

మార్కెట్లకు విదేశీ జోష్‌
వాణిజ్య వివాదాలకు చెక్‌ పెడుతూ చైనాతో పాక్షిక ఒప్పందం కుదిరే వీలున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో వారాంతాన ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు జోష్‌ వచ్చింది. దీంతో అమెరికా నుంచి ఆసియావరకూ మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్‌ 247 పాయింట్లు ఎగసి 38,127 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 71 పాయింట్లు పెరిగి 11,305 వద్ద నిలిచింది. విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత సెన్సెక్స్‌ లాభాల క్వాడ్రపుల్‌ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేసింది. వెరసి సెన్సెక్స్‌ 450 పాయింట్లు జంప్‌చేసి 38,345ను తాకగా.. నిఫ్టీ 125 పాయింట్లు ఎగసి 11,360కు చేరింది. అయితే జెడ్డావద్ద చమురు నౌకపై దాడులు జరిగిన వార్తలతో సెంటిమెంటుకు దెబ్బ తగిలింది. దీంతో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ నష్టాలలోకి సైతం ప్రవేశించింది. 37,738 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఈ బాటలో నిఫ్టీ 11,189 వరకూ జారింది.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,209 పాయింట్ల వద్ద, తదుపరి 11,112 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,382 పాయింట్ల వద్ద, తదుపరి 11,459 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,651, 27,260 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 28,518, 28,995 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

సీన్‌ రివర్స్‌
నగదు విభాగంలో వారాంతాన రివర్స్‌ సీన్‌ కనిపించింది. కొద్ది రోజులుగా అమ్మకాలకే కట్టుబడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 750 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. అయితే ఇటీవల పెట్టుబడులకే ఆసక్తి చూపుతూ వస్తున్న దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 703 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 263 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 503 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.



tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');