బంధన్‌ భళా- ఇండ్‌టెరైన్‌ సైతం!

బంధన్‌ భళా- ఇండ్‌టెరైన్‌ సైతం!

మార్జిగేజ్‌ రుణాలందించే గృహ ఫైనాన్స్‌ను విలీనం చేసుకోనున్న ప్రయివేట్‌ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ తాజాగా జోరందుకుంది. మోర్గాన్‌స్టాన్లీ కేపిటల్‌ ఇంటర్నేషనల్‌(ఎంఎస్‌సీఐ) ఇండెక్స్‌లో బంధన్‌ బ్యాంక్‌కు చోటు లభించనున్న వార్తలు దీనికి కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. మరోపక్క కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్‌ను ఇక్రా అప్‌గ్రేడ్‌ చేసినట్లు వెల్లడికావడంతో ఇండియన్‌ టెరైన్‌ ఫ్యాషన్స్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

బంధన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ 
ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు, కంపెనీల విశ్లేషణ చేపట్టడం ద్వారా ఇండెక్సులో మార్పులు చేపట్టే ఎంఎస్‌సీఐలో చోటు సాధిస్తున్న వార్తలు బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర సంస్థలు ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌ ప్రామాణికంగా పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఈ నెల 16 నుంచీ బంధన్‌ బ్యాంక్‌కు ఇండెక్స్‌లో చోటు లభించనున్నట్లు తెలుస్తోంది. దీంతో బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 20 శాతం జంప్‌చేసి రూ. 608ను తాకింది. ప్రస్తుతం 11.5 శాతం ఎగసి రూ. 565 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో గృహ ఫైనాన్స్‌ షేరు సైతం 8.5 శాతం జంప్‌చేసి రూ. 296 వద్ద ట్రేడవుతోంది. తొలుత 20 శాతం దూసుకెళ్లి రూ. 327ను అధిగమించింది.  కాగా.. గృహ ఫైనాన్స్‌ విలీనానికి ఈ నెల 17 రికార్డ్‌ డేట్‌గా అమలు చేస్తున్నట్లు బంధన్‌ బ్యాంక్‌ పేర్కొంది. దీనిలో భాగంగా గృహ ఫైనాన్స్‌ వాటాదారులకు తమ వద్ద గల ప్రతీ 1000 షేర్లకుగాను 568 బంధన్‌ బ్యాంక్‌ షేర్లను కేటాయించనున్నారు.

Image result for indian terrain logo

ఇండియన్‌ టెరైన్‌ ఫ్యాషన్స్‌
రెడీమేడ్‌ గార్మెంట్స్‌ తయారీ ఇండియన్‌ టెరైన్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌ దీర్ఘకాలిక రేటింగ్‌ను స్థిరత్వంతో కూడిన ఔట్‌లుక్‌తో A-గా ఇక్రా ప్రకటించింది. స్వల్పకాలిక రేటింగ్‌ను సైతం A2+గా ప్రకటించింది. దీంతో ఇండియన్‌ టెరైన్ బ్రాండుతో ఫ్యాషన్‌ దుస్తులను విక్రయించే ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసింది. రూ. 71 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ నిలకడైన పనితీరు, మార్కెట్లో పట్టు, ఉత్తరాదిలో విస్తరించే ప్రణాళికలను రేటింగ్‌కు పరిగణించినట్లు ఇక్రా పేర్కొంది.  tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');