ఎన్‌సీసీ డీలా- ఐబీ వెంచర్స్ గుడ్‌

ఎన్‌సీసీ డీలా- ఐబీ వెంచర్స్ గుడ్‌

కంపెనీ రేటింగ్‌ వాచ్‌ను ఇండియారేటింగ్స్‌ దిగువముఖంగా సవరించడంతో మౌలిక సదుపాయాల రంగ హైదరాబాద్‌ కంపెనీ ఎన్‌సీసీ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. కాగా.. మరోపక్క సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనకు బోర్డు నుంచి క్లియరెన్స్ లభించినట్లు వెల్లడించడంతో ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇతర వివరాలు చూద్దాం..

ఎన్‌సీసీ లిమిటెడ్‌
కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్‌ను తాజాగా ఇండియారేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్ ప్రతికూల దృష్టితో(నెగిటివ్‌ వాచ్‌) కూడిన IND Aకు సవరించినట్లు ఎన్‌సీసీ లిమిటెడ్‌ పేర్కొంది. గతంలో స్థిరత్వంతో కూడిన ఔట్‌లుక్‌తో IND A రేటింగ్‌ను ఇచ్చినట్లు బీఎస్‌ఈకి ఎన్‌సీసీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీసీ కౌంటర్లో అమ్మకాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 2.6 శాతం క్షీణించి రూ. 48 వద్ద ట్రేడవుతోంది.

Image result for indiabulls ventures limited

ఐబీ వెంచర్స్‌ లిమిటెడ్‌
ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజాగా ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ పేర్కొంది. దీనిలో భాగంగా షేరుకి రూ. 150 ధర మించకుండా 6.6 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇది కంపెనీ ఈక్విటీలో 10 శాతం వాటాకు సమానంకాగా.. ఇందుకు రూ. 1,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఐబీ వెంచర్స్‌ షేరు తొలుత 9 శాతం జంప్‌చేసింది. రూ. 109 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 1 శాతం లాభంతో రూ. 101 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 35.53 శాతం వాటా ఉంది. కాగా.. గత మూడు నెలల్లో ఈ షేరు 65 శాతం పతనంకావడం గమనార్హం!tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');