రుపీ.. జోరు

రుపీ.. జోరు

గత రెండు రోజుల్లో స్వల్ప ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ కరెన్సీ జోరందుకుంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 20 పైసలు(0.28 శాతం) ఎగసి 70.87 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం అదే స్థాయిలో ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా పాక్షిక డీల్‌ కుదిరే అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్నాయి. దేశీయంగానూ సెన్సెక్స్ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. ఇది రూపాయికి సైతం ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

యథాతథం
నిజానికి బుధవారం ముగింపు 71.07తో పోలిస్తే గురువారం 70.96 వద్ద రూపాయి సానుకూలంగా ప్రారంభమైంది. తదుపరి ఇంట్రాడేలో 70.87 వద్ద గరిష్టాన్ని అందుకోగా.. 71.15 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. చివరికి యథాతథంగా 71.07 వద్ద ముగిసింది. ఇక బుధవారం మాత్రం రూపాయి స్వల్పంగా 5 పైసల వెనకడుగుతో 71.07 వద్ద స్థిరపడింది. అంతకుముందు ఇంట్రాడేలో 70.94-71.22 మధ్య హెచ్చుతగ్గులను నమోదు చేసింది. విజయదశమి పర్వదినం సందర్భంగా మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం డాలరుతో మారకంలో రూపాయి 14 పైసలు నష్టపోయి 71.02 వద్ద ముగిసిన విషయం విదితమే. 



tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');