మార్కెట్‌ వీక్‌.. ఈ షేర్లు రయ్‌రయ్‌

మార్కెట్‌ వీక్‌.. ఈ షేర్లు రయ్‌రయ్‌

అమెరికా, చైనా ప్రతినిధుల మధ్య నేటి నుంచి ప్రారంభంకానున్న చర్చలపై తలెత్తిన అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమవుతోంది. ఏడాది కాలంగా కొనసాగుతున్న వాణిజ్య వివాద పరిష్కారానికి అత్యున్నత స్థాయిలో రెండు దేశాల ప్రతినిధులూ వారాంతం వరకూ చర్చలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇటీవల దేశీయంగా సెంటిమెంటు బలహీనపడటం కూడా దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 237 పాయింట్లు క్షీణించి 37,941ను తాకింది. వెరసి 38,000 పాయింట్ల దిగువకు చేరగా.. నిఫ్టీ 65 పాయింట్లు నీరసించి 11,248 వద్ద ట్రేడవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఈ  కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. జాబితాలో వొకార్డ్‌ లిమిటెడ్‌, థైరోకేర్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌, లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌, స్మార్ట్‌లింక్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌ అండ్‌ రెక్టిఫయర్స్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

వొకార్డ్‌ లిమిటెడ్‌: హెల్త్‌కేర్‌ సేవల రంగంలోని ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7.5 శాతం దూసుకెళ్లింది. రూ. 256కు చేరింది. ఇంట్రాడేలో రూ. 260 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 2.15 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.11 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

థైరోకేర్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌: డయాగ్నోస్టిక్‌ సేవల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 4 శాతం ఎగసింది. రూ. 520కు చేరింది. ఇంట్రాడేలో రూ. 526 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 1800 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 2400 షేర్లు ట్రేడయ్యాయి.

భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌: మొబైల్‌ టెలికం సేవల రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసింది. రూ. 376కు చేరింది. ఇంట్రాడేలో రూ. 385 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం 2.08 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 9.5 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌: డయాగ్నోస్టిక్‌ సేవల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6 శాతం లాభపడింది. రూ. 166కు చేరింది. ఇంట్రాడేలో రూ. 168ను తాకింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 3600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 6000 షేర్లు ట్రేడయ్యాయి.

స్మార్ట్‌లింక్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌: నెట్‌వర్క్‌ సర్వీసులకు సేవలందించే ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 79.5కు చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 700 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 200 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. 

ట్రాన్స్‌ఫార్మర్స్‌ అండ్‌ రెక్టిఫయర్స్‌: ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 19 శాతం పురోగమించింది. రూ. 8.25కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం(బీఎస్‌ఈ) 14400 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 80,000 షేర్లు చేతులు మారాయి.