కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దివాలీ కానుక..! 5 శాతం DA పెంపు !

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దివాలీ కానుక..! 5 శాతం DA పెంపు !

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సారి దీపావళి ముందుగానే వచ్చింది. ప్రభుత్వం  ఉద్యోగులకు మునుపెన్నడు ఇవ్వని విధంగా 5 శాతం డీఏను పెంచింది. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఈ డీఎ ప్రకటనను చేశారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులను ఏకంగా 5 శాతం డీఏను పెంచామని, ఇది జూలై 2019 నుండి అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం 12 శాతం వరకూ డీఏను పెంచింది. డియర్ నెస్ అలవెన్స్ (DA) ను పెంచడం ద్వారా కేంద్రం ఉద్యోగులను దీపావళి కానుకగా ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు వాఖ్యానిస్తున్నాయి. ఈ జీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్స్ కు వారి బేసిక్ శాలరీలో 17 శాతం డీఏగా పొందనున్నారు. కాగా ప్రతి ఏడాది రెండు సార్లు ఈ డీఏ సవరణలు ఉంటాయి. జనవరి, జూలై మాసాల్లో ఈ సవరణలను ప్రతిపాదిస్తారు. 
ప్రస్తుతం పెంచిన ఈ డీఏ వల్ల యేటా ప్రభుత్వానికి రూ. 16,000 కోట్ల అదనపు భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన 50 లక్షల మందికి, రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటున్న 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది.