మార్కెట్‌ స్పీడ్‌- ఈ షేర్లు.. స్కిడ్‌

మార్కెట్‌ స్పీడ్‌- ఈ షేర్లు.. స్కిడ్‌

యూరోపియన్ మార్కెట్లు హుషారుగా ప్రారంభంకావడం, మిడ్‌సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటం వంటి సానుకూలతలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 658 పాయింట్లు దూసుకెళ్లి 38,190ను తాకగా.. నిఫ్టీ 183 పాయింట్లు జంప్‌చేసి 11,310కు చేరింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. దీంతో ఈ  కౌంటర్లు భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో హిందుస్తాన్‌ కాపర్‌ లిమిటెడ్‌, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, వక్రంగీ లిమిటెడ్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం.. 

హిందుస్తాన్‌ కాపర్‌ లిమిటెడ్‌: కాపర్‌ గనుల ఈ పీఎస్‌యూ దిగ్గజ కంపెనీ కౌంటర్లో అమ్మేవాళ్లు అధికమై ఎన్‌ఎస్ఈలో 8.4 శాతం కుప్పకూలింది. రూ. 29కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు(బీఎస్‌ఈ) పరిమాణం 1.95 లక్షల షేర్లు కాగా.. చివరి సెషన్‌కల్లా 2.71 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: ఫైనాన్షియల్‌ సేవల రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 6.5 శాతం పతనమైంది. రూ. 73కు చేరింది. తొలుత రూ. 72 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 4.8 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 3.67 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌: డైవర్సిఫైడ్‌ బిజినెస్‌లు కలిగిన ఈ ప్రయివేట్‌ రంగ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం తిరోగమించింది. రూ. 1394కు చేరింది. ఇంట్రాడేలో రూ. 1329 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు(బీఎస్‌ఈ) ట్రేడింగ్‌ పరిమాణం 84000 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 2.1 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

వక్రంగీ లిమిటెడ్‌: ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగ సర్వీసుల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం దిగజారింది. అమ్మేవాళ్లు అధికంకావడంతో రూ. 26 వరకూ క్షీణించింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల(బీఎస్‌ఈ) సగటు ట్రేడింగ్‌ పరిమాణం 6.51 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 11.83 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌: ఆన్‌లైన్‌, క్యాపిటల్ మార్కెట్‌ ట్రేడింగ్ సేవల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం క్షీణించింది. రూ. 23.2కు చేరింది. ఇంట్రాడేలో రూ. 22 వద్ద 52 వారాల కనిష్టానికి చేరింది. ఈ కౌంటర్లో(బీఎస్‌ఈ) గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 2.46 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 25,000 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి.