రుపీ.. నేలచూపులో

రుపీ.. నేలచూపులో

డాలరుతో మారకంలో సోమవారం నష్టాల మధ్య కదిలిన దేశీ కరెన్సీ నీరసంగా ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 16 పైసల(0.2 శాతం) వెనకడుగుతో 71.18 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం  కాస్త కోలుకుని 9 పైసలు(0.12 శాతం) క్షీణించి 71.11 వద్ద ట్రేడవుతోంది. పాలసీ సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్‌ రెపో రేటులో 0.25 శాతం కోత విధించిన నేపథ్యంలో వారాంతాన రూపాయి నామమాత్ర క్షీణతతో 70.88 వద్ద ముగిసింది. విజయదశమి పర్వదినం సందర్భంగా  మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం రూపాయి 14 పైసలు నష్టపోయింది. 71.02 వద్ద ముగిసింది. కాగా.. దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల(అక్టోబర్‌)లో తొలి మూడు ట్రేడింగ్‌ సెషన్లలోనూ ఎఫ్‌పీఐలు నికరంగా ఈక్విటీలలో రూ. 3,000 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.