ఈ షేర్లు.. లాభాలతో ఊరిస్తున్నాయ్‌

ఈ షేర్లు.. లాభాలతో ఊరిస్తున్నాయ్‌

ఆర్థిక మాంద్య భయాలకు వ్యవయసాయేతర రంగ ఉపాధి గణాంకాలు చెక్‌ పెట్టడంతో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. ఈ ప్రభావంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వారాంతపు నష్టాల నుంచి బయటపడి హుషారుగా ప్రారంభమయ్యాయి. అయితే చివరి సెషన్‌లో అమ్మకాలు ఊపందుకోవడంతో తిరిగి నష్టాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. వెరసి ఈ  కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. జాబితాలో వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌, వెంకీస్‌ ఇండియా లిమిటెడ్‌, ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా లిమిటెడ్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌, ప్రైమ్‌ ఫోకస్‌ లిమిటెడ్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌: ఫాస్ట్‌ఫుడ్‌ రంగంలోని మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్ల నిర్వాహక ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7.4 శాతం జంప్‌చేసింది. రూ. 322కు చేరింది. ఇంట్రాడేలో రూ. 331ను సైతం తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 6750 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 3600  షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి.

ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ లిమిటెడ్‌: రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి రంగంలోని ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3 శాతం ఎగసింది. రూ. 279కు చేరింది. ఇంట్రాడేలో రూ. 290 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 9,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 11,000 షేర్లు ట్రేడయ్యాయి.

వెంకీస్‌ ఇండియా లిమిటెడ్‌: పౌల్టీ, ఫాస్ట్‌ఫుడ్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8.5 శాతం దూసుకెళ్లింది. రూ. 1619కు చేరింది. ఇంట్రాడేలో రూ. 1638కు ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 33000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 29000 షేర్లు ట్రేడయ్యాయి. 

ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా లిమిటెడ్‌: మ్యాట్రిమోనీ, ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్‌ సేవల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3.3 శాతం లాభపడింది. రూ. 2345కు చేరింది. ఇంట్రాడేలో రూ. 2398ను తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 20,600 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 20,300 షేర్లు ట్రేడయ్యాయి. 

ప్రైమ్‌ ఫోకస్‌ లిమిటెడ్‌: ఎంటర్‌టైన్‌మెంట్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం జంప్‌చేసింది. రూ. 43.3కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 7,400 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 3,200 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి.