రుపీ.. వెనకడుగుతో షురూ

రుపీ.. వెనకడుగుతో షురూ

డాలరుతో మారకంలో గత వారం లాభనష్టాల మధ్య కదిలిన దేశీ కరెన్సీ నీరసంగా ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 11 పైసల(0.16 శాతం) వెనకడుగుతో 70.99 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం19 పైసలు క్షీణించి 71.07 వద్ద ట్రేడవుతోంది. పాలసీ సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్‌ రెపో రేటులో 0.25 శాతం కోత విధించిన నేపథ్యంలో వారాంతాన రూపాయి నామమాత్ర క్షీణతతో 70.88 వద్ద ముగిసింది. అయితే గురువారం రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ 20 పైసలు ఎగసి 70.87 వద్ద స్థిరపడింది. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవుకాగా.. మంగళవారం రూపాయి 20 పైసలు నష్టపోయింది. 71.07 వద్ద ముగిసింది. డాలరుతో మారకంలో రూపాయి సోమవారం సైతం రూపాయి 31 పైసలు కోల్పోయిన విషయం విదితమే.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల(అక్టోబర్‌)లో తొలి మూడు ట్రేడింగ్‌ సెషన్లలోనూ ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో నికరంగా రూ. 3,000 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు.