ఇక దిక్సూచి Q2 ఫలితాలే

ఇక దిక్సూచి Q2 ఫలితాలే

ఇకపై దేశీ స్టాక్‌ మార్కెట్లకు కార్పొరేట్‌ ఫలితాలు దారిచూపనున్నాయి. ఈ వారం టెక్నాలజీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌ క్యూ2(జులై-సెప్టెంబర్‌) పనితీరు వెల్లడించనున్నాయి. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభంకానుంది. తొలిగా గురువారం(10న) టీసీఎస్‌తోపాటు ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ బాటలో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ 11న క్యూ2 పనితీరుతోపాటు.. క్యూ3 గైడెన్స్‌ ప్రకటించనుంది. దీంతో ఈ వారం కార్పొరేట్‌ ఫలితాల ఆధారంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ నెలకొనే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

Image result for indusind bank

4 రోజులే ట్రేడింగ్
విజయదశమి పర్వదినం సందర్భంగా మంగళవారం(8న) దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్‌ నాలుగుల రోజులకే పరిమితంకానుంది. కాగా.. ఆగస్ట్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) 11న వెలువడనున్నాయి. తయారీ రంగ గణాంకాలు సైతం ఇదే రోజు వెల్లడికానున్నాయి. గత వారాంతాన ఆర్‌బీఐ రెపో రేటులో 0.25 శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం సైతం మార్కెట్లపై కనిపించే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇక మరోపక్క అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ సమీక్ష వివరాలు(మినిట్స్‌) ఈ నెల 9న  విడుదలకానున్నాయి.

వాణిజ్య వివాదాలు
ఏడాది కాలంగా నలుగుతున్న వాణిజ్య వివాద పరిష్కారానికి అమెరికా, చైనా ప్రతినిధులు ఈ నెల 10 నుంచీ చర్చలు చేపట్టనున్నారు. వాషింగ్టన్‌ డీసీలో ప్రారంభంకానున్న ఈ చర్చల పురోగతిపైనా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు దేశాల మధ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తుతున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు పేర్కొంటున్న విషయం విదితమే.

ఇతర అంశాలూ..
ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ, స్వదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు తదితర పలు ఇతర అంశాలు సైతం దేశీయంగా స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');