ఇన్ఫో ఎడ్జ్‌ ప్లస్‌- లక్ష్మీ విలాస్‌ డౌన్‌

ఇన్ఫో ఎడ్జ్‌ ప్లస్‌- లక్ష్మీ విలాస్‌ డౌన్‌

సొంత అనుబంధ సంస్థ ద్వారా హ్యాపీలీ అన్‌మ్యారీడ్‌ మార్కెటింగ్‌ను ప్రారంభించిన నేపథ్యంలో ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది.  దీంతో ఈ షేరు లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోపక్క రిజర్వ్ బ్యాంక్‌ దిద్దుబాటు చర్యలు(పీసీఏ) ప్రారంభించిన నేపథ్యంలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. వెరసి మూడో రోజూ ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా జోరందుకోగా.. వరుసగా ఐదో రోజు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం.. 

ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా
పూర్తి అనుబంధ సంస్థ ద్వారా హ్యాపీలీ అన్‌మ్యారీడ్‌ మార్కెటింగ్‌ విభాగంపై రూ. 6 కోట్లను వెచ్చించినట్లు ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా తాజాగా పేర్కొంది. తద్వారా ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ ఇండస్ట్రీలో బిజినెస్‌ను మరింత పెంచుకోనున్నట్లు అంచనా వేస్తోంది. ఈ విభాగంలో ప్రవేశపెట్టిన అస్త్రా బ్రాండ్‌ ద్వారా పురుషుల సౌందర్య ఉత్పత్తులలోకి ప్రవేశించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 2208 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2240 వరకూ ఎగసింది. గత మూడు వారాల్లో ఈ కౌంటర్ 20 శాతం ర్యాలీ చేయడం విశేషం!

Image result for lakshmi vilas bank

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌
ఆర్‌బీఐ పీసీఏకు ఉపక్రమించిన నేపథ్యంలో వరుసగా ఐదో రోజు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం పతనమై రూ. 30 దిగువన ఫ్రీజయ్యింది. ఇది దాదాపు దశాబ్దకాలపు కనిష్టంకాగా.. గత ఐదు రోజుల్లోనే ఈ షేరు 22 శాతం పతనమైంది. ఇంతక్రితం 2009 మార్చిలో రూ. 26 వద్ద ఈ షేరు చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. కాగా.. పీసీఏలో భాగంగా బ్యాంకుకు సంబంధించిన మొండిబకాయిల రికవరీ, వ్యయాల అదుపు, పెట్టుబడుల పెంపు తదితరాలు కవర్‌కానున్నట్లు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ పేర్కొంటోంది.