ప్లాస్టిక్‌ సెగ- కుప్పకూలిన పేపర్‌ స్టాక్స్!

ప్లాస్టిక్‌ సెగ- కుప్పకూలిన పేపర్‌ స్టాక్స్!

పర్యావరణ పరిరక్షణకుగాను దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించనున్న అంచనాలతో ఇటీవల లాభాల దుమ్ము రేపుతున్న పేపర్, జూట్‌ ప్రొడక్టుల తయారీ కంపెనీల కౌంటర్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఒకేసారి వినియోగించే (సింగల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ ఉత్పత్తులను నిషేధించే యోచనలో ప్రస్తుతం  కేంద్ర ప్రభుత్వం లేదంటూ వెలువడిన వార్తలు దీనికి కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సింగిల్ యూజ్‌ ప్లాస్టిక్‌ ప్రొడక్టుల నిషేధంపై అంచనాలతో గత కొద్ది రోజులుగా పేపర్‌ స్టాక్స్‌లో భారీ ర్యాలీ వచ్చిన విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం..

పతన బాటలో..
వెనువెంటనే ప్లాస్టిక్‌ ఉత్పత్తులను నిషేధించే ప్రణాళికల్లో ప్రభుత్వం లేదంటూ వెలువడిన వార్తలు పేపర్‌, జూట్‌ ప్రొడక్టుల కంపెనీల షేర్లకు షాక్‌ నిచ్చాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టడంతో పలు కౌంటర్లు భారీగా పతనమయ్యాయి. జాబితాలో మలు పేపర్‌, స్టార్‌ పేపర్, ఇమామీ, ఓరియంట్‌, జేకే, శేషసాయి, వెస్ట్‌ కోస్ట్, టీఎన్‌పీఎల్‌ తదితరాలున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో లడ్లో జూట్‌ అండ్‌ స్పెషాలిటీస్‌ 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 95 దిగువన ఫ్రీజకాగా.. ఎన్‌ఎస్‌ఈలో మలు పేపర్‌ మిల్స్‌ 5 శాతం పతనమై రూ. 36.6 వద్ద నిలిచింది. ఈ బాటలో ఓరియంట్‌ పేపర్‌ 10 శాతం దిగజారి రూ. 28 దిగువన,  స్టార్‌ పేపర్‌ 10 శాతం పతనమై రూ. 140.3 వద్ద ఫ్రీజయ్యాయి. ఇదేవిధంగా వెస్ట్‌ కోస్ట్‌ 4 శాతం క్షీణించి రూ. 250కు చేరగా.. తొలుత రూ. 243కు జారింది. ఇక శేషసాయి 7 శాతం తిరోగమించి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 185 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

నష్టాల్లో..
పేపర్‌ తయారీ ఇతర కౌంటర్లలో రుచిరా 11 శాతం వెనకడుగుతో రూ. 88 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత రూ.  85 వరకూ నీరసించింది. ఇదే విధంగా జేకే పేపర్‌ 9 శాతం పతనమై రూ. 127ను తాకింది. ఇంట్రాడేలో రూ. 122కు చేరింది. ఇమామీ పేపర్‌ 5 శాతం క్షీణించి రూ. 92.15 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకగా.. టీఎన్‌పీఎల్‌ 5.2 శాతం నష్టంతో రూ. 193 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఆర్‌ అగర్వాల్‌ 9 శాతం పడిపోయి రూ. 246 వద్ద ట్రేడవుతోంది. కాగా.. బీఎస్‌ఈలో చెవియట్‌ కంపెనీ 13 శాతం కుప్పకూలి రూ. 677కు చేరింది. ఇంట్రాడేలో రూ. 636ను తాకింది. ఆస్ట్రన్‌ పేపర్‌ సైతం 2 శాతం నీరసించి రూ. 104 వద్ద, శ్రేయన్స్‌ 9 శాతం పతనంతో రూ. 131 వద్ద ట్రేడవుతున్నాయి.