అబాట్‌ -యాస్టర్ డీఎం.. జోరు

అబాట్‌ -యాస్టర్ డీఎం.. జోరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించాక జోరందుకున్న గ్లోబల్‌ ఫార్మా కంపెనీ అబాట్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. కాగా.. మరోపక్క మెడికేర్ హాస్పిటల్‌లో 5 శాతం అదనపు వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

అబాట్‌ ఇండియా
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ర్యాలీ బాటలో సాగుతున్న గ్లోబల్‌ ఫార్మా కంపెనీ అబాట్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 11,298 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 2 శాతం బలపడి రూ. 11,040 వద్ద ట్రేడవుతోంది. గత రెండు నెలల్లోనూ ఈ షేరు 35 శాతం ఎగసింది. కంపెనీ క్యూ1లో రూ. 117 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 42 శాతం వృద్ధికాగా.. అమ్మకాలు సైతం 18 శాతం పెరిగి రూ. 999 కోట్లను తాకింది. 

Image result for aster dm healthcare ltd

యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌
అనుబంధ సంస్థ మెడికేర్‌ హాస్పిటల్‌ ఎల్‌ఎల్‌సీలో అదనంగా 5 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ తాజాగా పేర్కొంది. దీంతో మెడికేర్‌ హాస్పిటల్‌లో వాటా 85 శాతానికి పెంచుకున్నట్లు తెలియజేసింది. యూఏఈలో ఆసుపత్రులను నిర్వహించే మెడికేర్‌ కార్యకలాపాలు 2006లో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాస్టర్‌ డీఎం షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 120 వద్ద ట్రేడవుతోంది. హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ యాస్టర్‌ డీఎంలో ప్రమోటర్లకు 37.80% వాటా ఉంది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');