ఆర్‌బీఎల్‌ జోష్‌- ఇండస్‌ఇండ్‌ మైనస్‌

ఆర్‌బీఎల్‌ జోష్‌- ఇండస్‌ఇండ్‌ మైనస్‌

అతి తక్కువ స్థాయిలోనే ఇండియాబుల్స్‌ గ్రూప్‌నకు ఎక్స్‌పోజర్‌ను కలిగి ఉన్నట్లు యాజమాన్యం పేర్కొన్న నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోవైపు ఇటీవల నష్టాల బాటలో సాగుతున్న ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌  కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌
ఇటీవల వివాదాస్పద వార్తలలో చిక్కుకుంటున్న ఇండియాబుల్స్‌ గ్రూప్‌నకు సంబంధించి అత్యంత తక్కువస్థాయిలోనే రుణాలను మంజూరు చేసినట్లు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ యాజమాన్యం తాజాగా పేర్కొంది. ఇదే విధంగా రంగాల వారీగా  బ్యాంక్‌ పోర్ట్‌ఫోలియోలో ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేసింది. ఏవైనా కంపెనీల ఎక్స్‌పోజర్‌కు సంబంధించి సమస్యలున్నాగానీ ఇవి మొత్తం ఆయా రంగానికి  సంబంధించినవికాదంటూ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.2 శాతం జంప్‌చేసి రూ. 312 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 320 వద్ద గరిష్టాన్ని, రూ. 292 వద్ద కనిష్టాన్నీ తాకింది. బుధవారం మార్కెట్లకు సెలవుకాగా.. మంగళవారం ఆర్‌బీఎల్ బ్యాంక్‌ షేరు తొలుత 22 శాతం పతనమైన విషయం విదితమే. చివరికి 9 శాతం నష్టంతో రూ. 299 వద్ద ముగిసింది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్
మూడు రోజులుగా 15 శాతం నష్టపోయిన ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ లిమిటెడ్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఇంట్రాడేలో ఈ షేరు 6 శాతం పతనమైంది. వెరసి నాలుగు రోజుల్లో 21 శాతంవరకూ నీరసించినట్లయ్యింది. ఒక ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీకి ఇచ్చిన రుణాలపై ఆందోళనలకు చెక్‌పెడుతూ.. మంగళవారం ఇవి పూర్తి కొలేటరల్‌గా పేర్కొన్నప్పటికీ ఇండస్‌ఇండ్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తం లోన్‌బుక్‌లో ఈ వాటా 0.35 శాతమేనంటూ బ్యాంక్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ షేరు 1 శాతం క్షీణించి రూ. 1284 వద్ద ట్రేడవుతోంది. తొలుత స్వల్ప లాభంతో రూ. 1309 వద్ద ప్రారంభమైనప్పటికీ తదుపరి రూ. 1220 వరకూ నీరసించింది. ఇది 2017 జనవరి కనిష్టంకావడం గమనార్హం!tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');