అమ్మకాల షాక్‌- బ్యాంక్స్‌ బేర్‌

అమ్మకాల షాక్‌- బ్యాంక్స్‌ బేర్‌

మిడ్‌సెషన్‌ తదుపరి సడెన్‌గా అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లకు షాక్‌ తగిలింది. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, రియల్టీ రంగాలలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 600 పాయింట్లు పడిపోయింది. 38,000 పాయిట్ల దిగువన 37,930 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 11,248 దిగువకు జారింది. చివరికి సెన్సెక్స్‌ 362 పాయింట్లు పతనమై 38,305 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 115 పాయింట్లు కోల్పోయి 11,360 వద్ద స్థిరపడింది. అయితే తొలుత ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ 38,924కు జంప్‌చేయగా... నిఫ్టీ 11,554 వరకూ ఎగసింది. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1000 పాయింట్ల స్థాయిలో ఆటుపోట్లను చవిచూసింది. 

మీడియా పతనం
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ నష్టపోగా.. రియల్టీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 4-3 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ బాటలో మెటల్‌, ఐటీ సైతం 1.5 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 22 శాతం, జీ 11 శాతం చొప్పున కుప్పకూలగా.. ఇండస్‌ఇండ్, ఎస్‌బీఐ, గ్రాసిమ్‌, ఎయిర్‌టెల్‌, సిప్లా, ఇన్‌ఫ్రాటెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్‌ ఇండియా 6-3 శాతం మధ్య క్షీణించాయి. అయితే బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐవోసీ, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌, హెచ్‌యూఎల్‌ 5-0.6 శాతం మధ్య ఎగశాయి. 

ఐబీ హౌసింగ్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐడియా, డిష్‌ టీవీ 10 శాతం చొప్పున పతనంకాగా.. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, అపోలో టైర్‌, జిందాల్‌ స్టీల్‌ 8-5 శాతం మధ్య నష్టపోయాయి. కాగా.. మరోపక్క ఐబీ హౌసింగ్‌ 10 శాతం దూసుకెళ్లగా.. ఎన్‌ఎండీసీ, కంకార్‌, ఎస్కార్ట్స్‌, పిరమల్‌, హెచ్‌పీసీఎల్‌, మైండ్‌ట్రీ 9.2-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా..  రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఇండియాబుల్స్‌, ఒబెరాయ్‌, శోభా, ప్రెస్టేజ్‌, సన్‌టెక్‌ 7-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు హుషారుగా ప్రారంభమై పతనంతో ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ అమ్మకాల సెగ తగిలింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.5 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1795 నష్టపోగా.. 688 నష్టాలతో ముగిశాయి. 

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 469 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 505 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. కాగా.. వారాంతన ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 214 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. డీఐఐలు దాదాపు రూ. 459  కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');