ఈ చిన్న షేర్లకు నష్టాల బీపీ

ఈ చిన్న షేర్లకు నష్టాల బీపీ

ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాలు వెల్తువెత్తడంతో మార్కెట్లు కుప్పకూలాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 621 పాయింట్లు పతనమై 38,046కు చేరగా.. నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయి 11,274ను తాకింది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి ఈ  కౌంటర్లు భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, శ్రేఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఓరియంట్‌ ప్రెస్‌ లిమిటెడ్‌, రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం.. 

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌: ఎన్‌బీఎఫ్‌సీ ఈ కంపెనీ కౌంటర్లో అమ్మేవాళ్లు అధికమై ఎన్‌ఎస్ఈలో 20 శాతం కుప్పకూలింది. రూ. 31 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల కనిష్టం. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 24 లక్షల షేర్లు కాగా.. చివరి సెషన్‌కల్లా 16 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

శ్రేఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌: ఫైనాన్షియల్‌ సేవల రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్ఈలో 16 శాతం పతనమైంది. రూ. 7.8కు చేరింది. తొలుత రూ. 7.5 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 60000 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 74000 షేర్లు ట్రేడయ్యాయి. 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌: మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 13 శాతం దిగజారింది. రూ. 232కు చేరింది. ఇంట్రాడేలో రూ. 199 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 15.86 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 18 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ఓరియంట్‌ ప్రెస్‌ లిమిటెడ్‌: పేపర్ తయారీ ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం క్షీణించింది. రూ. 111కు చేరింది. తొలుత రూ. 102 దిగువన ఇంట్రాడేలో కనిష్టానికి చేరింది. ఈఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 240 లక్షల షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 30 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి. 

రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌: మౌలిక సదుపాయాల ఈ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 13 శాతం దిగజారింది. రూ. 51.5కు చేరింది. ఇంట్రాడేలో రూ. 51 దిగువన 52 వారాల కనిష్టానికి చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు ట్రేడింగ్‌ పరిమాణం 4,700 షేర్లుకాగా.. చివరి సెషన్‌కల్లా 10,000 షేర్లు ట్రేడయ్యాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');