పీఎన్‌బీ హౌసింగ్‌- నేషనల్‌ పెరాక్సైడ్‌

పీఎన్‌బీ హౌసింగ్‌- నేషనల్‌ పెరాక్సైడ్‌

కంపెనీ చైర్మన్‌ సునీల్‌ మెహతా రాజీనామా చేసిన వార్తలతో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ప్లాంటు తాత్కాలిక మూసివేత వార్తలతో నేషనల్‌ పెరాక్సైడ్‌ లిమిటెడ్‌ కౌంటర్ సైతం డీలా పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ రెండు కౌంటర్లూ నేలచూపులతోనే కదులుతున్నాయి. వివరాలు చూద్దాం..

పీఎన్‌బీ హౌసింగ్‌ లిమిటెడ్‌
కంపెనీ చైర్మన్‌, నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సునీల్‌ మెహతా రాజీనామా చేసినట్లు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్ తాజాగా వెల్లడించింది. అయితే కంపెనీ పదవికి గడువు తీరడంతో సునీల్‌ మెహతా బాధ్యతలకు రాజీనామా చేసినట్లు  పేర్కొంది. కాగా.. రేటింగ్‌ కంపెనీ క్రిసిల్.. రూ. 500 కోట్ల స్వల్పకాలిక ఎన్‌సీడీలకు A1+ రేటింగ్‌ను ప్రకటించినట్లు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్ తెలియజేసింది. సమయానుగుణ చెల్లింపులు, రక్షణకు సంబంధించి కంపెనీ పటిష్టతను ఈ రేటింగ్‌ ప్రతిబింబిస్తున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పీఎన్‌బీ హౌసింగ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం క్షీణించి రూ. 566 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 557 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. 

నేషనల్‌ పెరాక్సైడ్‌ లిమిటెడ్‌
సామర్థ్య విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్లాంటును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, గ్యాస్ తదిరాల తయారీ సంస్థ నేషనల్‌ పెరాక్సైడ్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. కళ్యాణ్‌ ప్లాంటు తయారీ సామర్థ్యాన్ని ప్రస్తుత 95,000 ఎంటీ నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు తెలియజేసింది. దీంతో వార్షిక సామర్థ్యం 1,50,000 ఎంటీకి పెరగనున్నట్లు వివరించింది. ప్లాంటును మూడు నెలలపాటు మూసివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నేషనల్‌ పెరాక్సైడ్‌ షేరు బీఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ. 1897 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1850 వరకూ జారింది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');