ఈ పీఎస్‌యూ షేర్లు భళా!

ఈ పీఎస్‌యూ షేర్లు భళా!

కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికల్లో ఉన్నట్లు వెలువడిన వార్తలు పీఎస్‌యూ రంగ కౌంటర్లకు జోష్‌నిస్తున్నాయి. ఇంధన రంగ దిగ్గజం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌), లాజిస్టిక్స్‌ దిగ్గజం కంటెయినర్‌ కార్పొరేషన్(కంకార్‌), సముద్ర రవాణా కంపెనీ షిప్పింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌సీఐ)లతోపాటు.. క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీ బీఈఎంఎల్‌ లిమిటెడ్‌లో ప్రభుత్వం కొంతమేర వాటాలు విక్రయించే ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోవైపు తాజాగా ఆర్డర్లను సంపాదించిన వార్తలతో ఇంజినీరింగ్‌ పీఎస్‌యూ ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం..

Image result for BPCL CONCORImage result for container corporation of india logo

లాభాలతో..
మార్చికల్లా ఎంపిక చేసిన పీఎస్‌యూలలో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ చేపట్టే ప్రణాళికల్లో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇందుకు వీలుగా కేంద్ర కేబినెట్‌ అనుమతిని కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీపీసీఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5.2 శాతం జంప్‌చేసింది. రూ. 494 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 512 సమీపానికి చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. కంటెయినర్‌  కార్ప్‌ షేరు 3.4 శాతం ఎగసింది. రూ. 625 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 650 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో షిప్పింగ్‌ కార్పొరేషన్ 6.3 శాతం పెరిగి రూ. 46 వద్ద కదులుతోంది. తొలుత రూ. 49కు చేరింది. ఇక బీఈఎంఎల్‌ లిమిటెడ్‌ షేరు 1 శాతం పుంజుకుని రూ. 963 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 975 వద్ద గరిష్టాన్ని తాకింది.

Image result for shipping corporation of india logo

నెల రోజులుగా..
గత నెల రోజుల్లో ఎస్‌సీఐ షేరు 77 శాతం దూసుకెళ్లగా.. బీపీసీఎల్‌ 44 శాతం పురోగమించింది. ఈ బాటలో కంకార్‌ కౌంటర్ సైతం 27 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! ఇదే సమయంలో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 4 శాతమే బలపడింది. కాగా.. బీపీసీఎల్‌, ఎస్‌సీఐ కంపెనీలలో ప్రభుత్వం తమకున్న పూర్తి వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా కంకార్‌లో ప్రస్తుతమున్న 54.8 శాతం వాటాలో 30 శాతం వరకూ విక్రయించే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి..

Image result for nbcc india ltd

ఎన్‌బీసీసీ జూమ్‌
జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం యువజన, క్రీడల శాఖతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఎన్‌బీసీసీ ఇండియా తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా మణిపూర్‌లోని ఇంపాల్‌లో నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సేవలు అందించవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఆర్డర్ విలువను రూ. 400 కోట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎన్‌బీసీసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 8 శాతం జంప్‌చేసి రూ. 37 సమీపానికి చేరింది. ప్రస్తుతం యథాతథంగా రూ. 35 వద్ద ట్రేడవుతోంది.