ఆటో- బ్యాంక్స్‌.. థండర్‌ ర్యాలీ

ఆటో- బ్యాంక్స్‌.. థండర్‌ ర్యాలీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన కార్పొరేట్‌ ట్యాక్స్‌ వరాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లకు ఎక్కడలేని శక్తీ  వచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 1850 పాయింట్లు దూసుకెళ్లి 37,943ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 555 పాయింట్లు జంప్‌చేసి 11,260 వద్ద ట్రేడవుతోంది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్ రంగాలు పోల్‌వాల్ట్‌ను తలపించాయి. ఎన్‌ఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌ 10 శాతం, బ్యాంక్‌ నిఫ్టీ 9 శాతం చొప్పున జంప్‌చేశాయి. వెరసి అటు ఆటోమొబైల్‌, ఇటు పబ్లిక్‌, ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ కౌంటర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం..

ఆటో జూమ్‌
ఎన్‌ఎస్‌ఈలో ఆటో ఇండెక్స్‌లో భాగమైన అశోక్‌ లేలాండ్‌ 15 శాతం, మదర్‌సన్‌సుమీ 13 శాతం చొప్పున దూసుకెళ్లగా.. మారుతీ, ఐషర్‌ మోటార్స్‌, హీరో మోటో 12 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఈ బాటలో టీవీఎస్‌ మోటార్‌, ఎంఆర్‌ఎఫ్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఆటో, భారత్ ఫోర్జ్‌, ఎక్సైడ్‌, అమరరాజా, అపోలో టైర్‌, బాష్‌ 11-5 శాతం మధ్య ఎగశాయి. 
 
బ్యాంకింగ్‌ హవా
బ్యాంక్‌ నిఫ్టీ కౌంటర్లలో ఆర్‌బీఎల్‌, ఫెడరల్‌, ఇండస్‌ఇండ్, స్టేట్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, యాక్సిస్‌, బీవోబీ, పీఎన్‌బీ, యస్‌ బ్యాంక్‌ 13-4 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర కౌంటర్లలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌, కెనా, డీసీబీ బ్యాంక్‌, ఓబీసీ, సెంట్రల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ 10-3 శాతం మధ్య పుంజుకున్నాయి.