NBFCలను ఆదుకుంటాం- ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 

NBFCలను ఆదుకుంటాం- ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 

పూర్తిగా ఆటోమేటెడ్ జిఎస్‌టి ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ రీఫండ్ విధానం ఈ నెలాఖరులోగా సిద్ధంగా ఉంటుందని సీతారామన్ తెలిపారు.చిన్న మరియు మధ్యతరహా ఎగుమతిదారులు తమ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వాపసులను త్వరగా పొందుతారు, మరియు వారి పని మూలధనం పెండింగ్ బకాయిల్లో చిక్కుకోజాలదు. రూ. 1700 కోట్ల విలువైన ఎగుమతులకు గానూ వర్కింగ్ క్యాపిటల్ కోసం రుణం ఇచ్చే బ్యాంకులకు అధిక భీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతే కాకుండా జీఎస్టీ లో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ల కోసం పూర్తి ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ రీఫండ్ ఉండబోతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ ఫర్ ఎక్స్‌పోర్ట్‌ ప్రొడక్ట్స్ RoDTEP విధానం ద్వారా ప్రస్తుతం ఉన్న MEIS విధానంలోని సంక్లిష్టతలను రూపుమాపనున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. రెమిషన్ డ్యూటీస్ ఎక్స్‌పోర్ట్ విధానం ద్వారా ప్రభుత్వానికి రూ. 50,000 కోట్ల రాబడి రానున్నట్టు తెలిపారు. మార్చ్ 2020 మార్చ్ నెలలో దేశ వ్యాప్తంగా మెగా షాపింగ్ ఫెస్టివల్‌ను నిర్వహించునున్నామని , దీని ద్వారా ప్రజలకు , వ్యాపారులకు మధ్య సంబంధాలు , క్రయ విక్రయాల విషయంలో మెరుగైన ఫలితాలు ఉండనున్నాయని ఆమె పేర్కొన్నారు. పారిశ్రామిక ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ప్రపంచ మాంద్యం భయాలు మన ఆర్ధిక వ్యవస్థను పెద్దగా భయపెట్టలేదని ఆర్ధిక మంత్రి అంటున్నారు. ప్రభుత్వ చర్యల ద్వారా రిజర్వ్ బ్యాంక్ రిటైల్ మాంద్యాన్ని 2-6 శాతానికి పరిమితం చేయగలిగిందని ఆమె తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలకు కేంద్రం నుండి నిధుల సహకారం ఉంటుందని, పార్షియల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ ద్వారా NBFCలు లాభపడనున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచడం ద్వారా ఎగుమతుల సమయాన్ని మరింత తగ్గించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె అన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతులు ఉండేలా ఒక యాక్షన్ ప్లాన్‌ను రూపొందించనున్నట్టు, ఈ వ్యవహారాల్ని కేంద్ర మంత్రిత్వ కమిటీ పర్యవేక్షిస్తుందని ఆమె పేర్కొన్నారు. 2019 డిసెంబర్ నాటికి ఈ ప్రణాళిక అమల్లోకి వచ్చేలా చేయనున్నట్టు సీతా రామన్ తెలిపారు. గృహ నిర్మాణాలకు కేంద్రం ఇచ్చే రాయితీలను మరో రూ. 1.5 లక్షలను పెంచామని, రూ. 45 లక్షల విలువ లోపు  ఇంటిని కొనుగోలు చేసే వారికి ఇది మరింత లబ్దిని చేకూర్చనుందని ఆమె పేర్కొన్నారు. 



Most Popular