ఈ షేర్లు.. భలే స్పీడ్‌ గురూ..  

ఈ షేర్లు.. భలే స్పీడ్‌ గురూ..  

ప్రపంచవ్యాప్తంగా  మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో వరుసగా ఆరో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. అయితే కొంతమేర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో జైకార్ప్‌ లిమిటెడ్‌, గ్రాఫైట్‌ ఇండియా, హెచ్ఈజీ లిమిటెడ్‌, ఐఆర్‌బీ  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్, మన్‌ అల్యూమినియం చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

జై కార్ప్‌ లిమిటెడ్‌: డైవర్సిఫైడ్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసింది. రూ. 91కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 94 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 1.97 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 5.56 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

గ్రాఫైట్‌ ఇండియా లిమిటెడ్‌: గ్రాఫైట్స్‌ తయారీ ఈ ప్రయివేట్‌ రంగ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7 శాతం ఎగసింది. రూ. 303కు చేరింది. ఇంట్రాడేలో రూ. 312 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 1.22 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 4.21 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

హెచ్ఈజీ లిమిటెడ్‌: గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లింది. రూ. 1116కు చేరింది. ఇంట్రాడేలో రూ. 1144 వరకూ జంప్‌ చేసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 37,700 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 84,000 షేర్లు ట్రేడయ్యాయి. 

ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌: మౌలిక సదుపాయాల రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8.5 శాతం పురోగమించింది. రూ. 84కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 86.5 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 85,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.21 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. 

ఆటోలైన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌: ఆటో విడిభాగాల తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 43కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 2,100 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 18,000 షేర్లు ట్రేడయ్యాయి. 

మన్‌ అల్యూమినియం లిమిటెడ్‌: మెటల్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లింది. రూ. 81కు చేరింది. ఇంట్రాడేలో రూ. 88 వరకూ దూసుకెళ్లింది.ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 16,000 షేర్లు ట్రేడయ్యాయి.