ఆటో, రియల్టీ, బ్యాంక్స్‌ జూమ్‌

ఆటో, రియల్టీ, బ్యాంక్స్‌ జూమ్‌

ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 115 పాయింట్లు పెరిగి 37,260కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 29 పాయింట్లు పుంజుకుని 11,032 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల తగ్గింపు, సహాయక ప్యాకేజీలవైపు దృష్టిసారించనున్న వార్తలతో మంగళవారం అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు లాభపడగా.. ప్రస్తుతం ఆసియాలోనూ సానుకూల ధోరణి నెలకొంది. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.  

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా  రియల్టీ, ఆటో, పీఎస్‌యూ బ్యాంక్స్‌, మెటల్‌ రంగాలు 3-2 శాతం మధ్య ఎగశాయి. ఐటీ 1.3 శాతం డీలాపడింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్‌, సిండికేట్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బీవోబీ, కెనరా, పీఎన్‌బీ, ఓబీసీ, జేఅండ్‌కే, అలహాబాద్‌, ఎస్‌బీఐ 5-2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఆటో కౌంటర్లలో టాటా మోటార్స్‌, మదర్‌సన్‌, ఐషర్‌, టీవీఎస్‌, మారుతీ, బజాజ్‌ ఆటో, భారత్‌ ఫోర్జ్‌, అమరరాజా, ఎంఅండ్‌ఎం, ఎంఆర్ఎఫ్‌ 8-2 శాతం మధ్య ఎగశాయి. మెటల్‌ కౌంటర్లలో జిందాల్‌ హిసార్‌, జిందాల్‌ స్టీల్‌, వెల్‌స్పన్‌ కార్ప్, సెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, వేదాంతా, నాల్కో, ఎన్‌ఎండీసీ 9-2 శాతం మధ్య పెరిగాయి. అయితే ఐటీ కౌంటర్లలో విప్రొ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, నిట్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ 2.4-1.2 శాతం మధ్య క్షీణించాయి. రియల్టీ కౌంటర్లలో ఒబెరాయ్‌, డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, మహీంద్రా లైఫ్‌, శోభా, ప్రెస్టేజ్‌ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి.

చిన్న షేర్లు గుడ్‌
మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్న నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.7-1.25 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1697 లాభపడగా.. 669 మాత్రమే నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో గోవా కార్బన్‌, ట్రైజిన్‌, స్టార్‌ పేపర్‌ 20 శాతం చొప్పున దూసుకెళ్లగా.. ఓరియంట్‌ పేపర్‌, శేషసాయి, ధంపూర్‌, రుచిరా, ఎన్‌ఆర్‌ అగర్వాల్‌, చమన్‌లాల్‌, జేకే పేపర్, దాల్మియా షుగర్, ఆర్‌పీజీ లైఫ్, యూనివర్సల్‌ కేబుల్స్‌, బోడల్‌ కెమ్, దావత్‌, పవర్‌మెక్‌ ఓరికాన్‌ తదితరాలు 18-11 శాతం మధ్య జంప్‌ చేశాయి.