ఈ మిడ్‌ క్యాప్స్‌.. ధూమ్‌ధామ్‌

ఈ మిడ్‌ క్యాప్స్‌.. ధూమ్‌ధామ్‌

ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడిన సెంటిమెంటు నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లు ఇన్వెస్టర్లను భారీగా ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం. జాబితాలో వొకార్డ్‌ లిమిటెడ్‌, యస్ బ్యాంక్‌ లిమిటెడ్‌, జైన్‌ ఇరిగేషన్ సిస్టమ్స్‌, జూబిలెంట్ లైఫ్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

వొకార్డ్‌ లిమిటెడ్‌: ఫార్మా రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 13.5 శాతం దూసుకెళ్లింది. రూ. 276కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 283 వరకూ పుంజుకుంది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 45,500 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 94,000 షేర్లు ట్రేడయ్యాయి.

యస్ బ్యాంక్‌ లిమిటెడ్‌: ప్రయివేట్‌ రంగ ఈ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 13.5 శాతం జంప్‌చేసింది. రూ. 72కు చేరింది. ఇంట్రాడేలో రూ. 75 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 141.5 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 106.78 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

జైన్‌ ఇరిగేషన్ సిస్టమ్స్‌: వ్యవసాయ పరికరాల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 13.5 శాతం ఎగసింది. రూ. 22.5కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 1.23 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 1.6 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

జూబిలెంట్ లైఫ్‌ సైన్సెస్‌ లిమిటెడ్‌: ఫార్మా రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 6.5 శాతం పురోగమించింది. రూ. 522కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 532 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 70,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 50,300 షేర్లు ట్రేడయ్యాయి. 

జిందాల్‌ స్టెయిన్‌లెస్‌(హిసార్‌) లిమిటెడ్‌: మెటల్‌ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7 శాతం పురోగమించింది. రూ. 71కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం కేవలం 43,700 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా 42,300 షేర్లు ట్రేడయ్యాయి.