దిలీప్‌ బిల్డ్‌- దివాన్‌ హౌసింగ్‌.. కేక

దిలీప్‌ బిల్డ్‌- దివాన్‌ హౌసింగ్‌.. కేక

హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌(HAM)లో సాధించిన ఏడు ప్రాజెక్టుల విక్రయానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కంపెనీ దిలీప్‌ బిల్డ్‌కాన్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోపక్క డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌కు జారీ చేసిన కమర్షియల్‌ చెల్లింపులను పూర్తి చేసినట్లు పేర్కొనడంతో ఎన్‌బీఎఫ్‌సీ.. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

దిలీప్‌ బిల్డ్‌కాన్‌ లిమిటెడ్‌
హెచ్‌ఏఎం విభాగంలో ఇటీవల క్యూబ్‌ ఇన్‌ఫ్రాకు ఐదు ప్రాజెక్టులను విక్రయించిన దిలీప్‌ బిల్డ్‌కాన్‌ తాజాగా మరో ఏడు ప్రాజెక్టులను అమ్మేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఐదు ప్రాజెక్టుల విక్రయం ద్వారా కన్సాలిడేటెడ్‌ రుణ భారంలో రూ. 1800 కోట్లను తిరిగి చెల్లించినట్లు కంపెనీ అధికారి రోహన్‌ సూర్యవంశీ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా.. హెచ్‌ఏఎం ప్రాజెక్టుల విక్రయం నేపథ్యంలో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ షేరుకి అప్రమత్తతతో కూడిన బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇందుకు రూ. 720 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దిలీప్‌ బిల్డ్‌ షేరు 9.6 శాతం దూసుకెళ్లి రూ. 422 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 429 వరకూ ఎగసింది. 

Image result for dewan housing finance

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
గతంలో డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌కు జారీ చేసిన రూ. 150 కోట్ల కమర్షియల్‌ పేపర్స్‌ చెల్లింపులను పూర్తిచేసినట్లు దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ పేర్కొంది. మూడు విడతలలో వీటిని చెల్లించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా ఐడీబీఐ ఏఎంసీకు సైతం రూ. 12.5 కోట్ల బకాయిలను చెల్లించినట్లు తెలియజేసింది. కాగా..  ప్రస్తుతం బ్యాంకుల కన్సార్షియం ద్వారా కంపెనీ రుణ విమోచన(డెట్‌ రిజల్యూషన్‌) ప్రాసెస్‌ జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 50 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 52 వరకూ ఎగసింది.