37,000- 11,000 దాటేశాయ్‌

37,000- 11,000 దాటేశాయ్‌

అమెరికా, ఆసియా గణాంకాల నిరాశతో తొలుత నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలు ఆపి కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. ఫలితంగా ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 37,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,000 పాయింట్ల మార్క్‌లను అవలీలగా అధిగమించాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 229 పాయింట్లు జంప్‌చేసి 37,211కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 74 పాయింట్లు ఎగసి 11,020 వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌లో అమెరికా వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు, చైనీస్‌ ఎగుమతులు నీరసించగా.. ఏప్రిల్‌-జూన్‌లో జపనీస్‌ జీడీపీ వృద్ధి అంచాలకంటే దిగువనే నమోదైంది. వెరసి కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగానే స్పందిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఆటో రంగాలు 1.0.5 శాతం మధ్య పుంజుకోగా.. ఐటీ 0.6 శాతం డీలాపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఎయిర్‌టెల్‌ 2.6-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే  హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ 1.2 శాతం స్థాయిలో నీరసించాయి. 

దివాన్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో దివాన్‌ హౌసింగ్‌, ఆర్‌బీఎల్ బ్యాంక్‌, ఎంసీఎక్స్‌, రిలయన్స్ ఇన్‌ఫ్రా, డిష్‌ టీవీ, ఎన్‌బీసీసీ, మణప్పురం, ఎన్‌సీసీ, ఫెడరల్ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7-3 శాతం మధ్య  జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఈక్విటాస్‌ 8 శాతం పతనంకాగా, టొరంట్ ఫార్మా, అశోక్ లేలాండ్‌, ఉజ్జీవన్‌, అపోలో హాస్పిటల్స్‌, కజారియా, హెక్సావేర్‌ 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. 

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్న నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ పుంజుకున్నాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.8 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1464 లాభపడగా.. 807 మాత్రమే నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో గోవా కార్బన్‌ 20 శాతం దూసుకెళ్లగా.. శంకర, మాస్టెక్‌, టెక్స్‌ ఇన్ఫ్రా, ఏస్‌, గ్రావిటా, రెయిన్‌, ఎన్‌డీఎల్‌, డీబీఎల్‌, శ్రీ లెదర్స్‌, అపోలో మైక్రో, జేఎస్‌ఎల్‌, ఎమ్‌కే, టీపీఎల్‌, హెచ్‌ఐఎల్‌ తదితరాలు 18-8 శాతం మధ్య జంప్‌ చేశాయి.