స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (సెప్టెంబర్ 9)

స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌.. (సెప్టెంబర్ 9)
 • సెప్టెంబర్‌ 17న జరిగే బోర్డు మీటింగ్‌లో బోనస్‌ ఇష్యూపై నిర్ణయం తీసుకోనున్న బాల్మెర్‌ అండ్‌ లారీ
 • సెప్టెంబర్‌ 26కు వాయిదా పడిన జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ వాటాదారుల వార్షిక సమావేశం
 • క్యూఐపీ పద్ధతిలో రూ.900 కోట్ల నిధులను సమీకరించనున్న వరుణ్‌ బేవరేజెస్‌
 • ఎన్‌సీడీలపై రూ.20.24 కోట్ల వడ్డీ చెల్లింపులో డీఫాల్ట్‌ అయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌
 • తెలంగాణలోని శిల్పా మెడికేర్‌ ఫార్ములేషన్‌ ప్లాంట్‌పై యూఎస్‌ఎఫ్‌డీఏ 2 అభ్యంతరాలు
 • ఔషధ బ్యాచ్‌ నెంబర్‌ తప్పుగా ముద్రించడంతో యూఎస్‌ మార్కెట్‌ నుంచి సిమ్‌వాస్టాటిన్‌ టాబ్లెట్లను వెనక్కి తీసుకున్న అరబిందో ఫార్మా
 • ముంబై విమానాశ్రయ వాటా వివాదంపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన అదానీ గ్రూప్‌
 • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి ఆర్‌కామ్‌, జెన్‌ల్యాబ్స్‌ ఎతికా
 • ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలిగిన జైన్‌ ఇరిగేషన్‌, రిలయన్స్‌ పవర్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, సంధానా నైట్రో కెమ్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, బజాజ్‌ హిందుస్తాన్‌
 • షార్ట్‌టర్మ్‌ ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌ నుంచి వైదొలిగిన ఆర్‌కామ్‌, ఎన్‌ఆర్‌ అగర్వాల్ ఇండస్ట్రీస్‌
 • జేపీ ఇన్‌ఫ్రా, ఎస్పార్‌ షిప్పింగ్‌ సర్క్యూట్‌ ఫిల్టర్‌ 5శాతానికి సవరింపు