మెటల్స్‌, బ్యాంక్స్‌.. బౌన్స్‌బ్యాక్‌

మెటల్స్‌, బ్యాంక్స్‌.. బౌన్స్‌బ్యాక్‌

ఇటీవల భారీ అమ్మకాలతో కుదేలైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ నుంచీ బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ట్రేడర్లు షార్ట్‌కవరింగ్ చేపట్టడం, ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించాయి. ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 228 పాయింట్లు ఎగసి 36,701 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 88 పాయింట్లు బలపడి 10,829 వద్ద స్థిరపడింది. అయితే తొలుత యథాప్రకారం అమ్మకాలు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనమై 36,102 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇది 5 నెలల కనిష్టంకాగా.. తదుపరి 36,800ను సైతం అధిగమించింది. వెరసి సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 700 పాయింట్లమేర ఆటుపోట్లను చవిచూసింది. ఇక ఫిబ్రవరి తరువాత ఉదయం మళ్లీ 10,700 దిగువకు చేరిన నిఫ్టీ సైతం100 పాయింట్లు జంప్‌చేసింది. 10,862ను దాటింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్‌లో అదనంగా విధించిన లెవీను  ప్రభుత్వం ఉపసంహరించనుందన్న అంచనాలు సెంటిమెంటుకు బూస్ట్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

మీడియా జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మీడియా, మెటల్‌, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 4.2-2 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో ఫార్మా, ఆటో, ఐటీ సైతం 1.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. మెటల్‌ కౌంటర్లలో వేదాంతా, జిందాల్‌ స్టీల్‌, నాల్కో, సెయిల్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో బీవోఐ, బీవోబీ, పీఎన్‌బీ, కెనరా, అలహాబాద్‌, ఓబీసీ, యూనియన్‌, ఎస్‌బీఐ 3.5-1 శాతం మధ్య ఎగశాయి. ఇక మీడియా కౌంటర్లలో నెట్‌వర్క్‌18, డిష్‌ టీవీ, జీ, టీవీ 18, సన్‌ టీవీ, డెన్‌, పీవీఆర్‌ 12-3.2 శాతం మధ్య పురోగమించాయి.
 
యస్‌ బ్యాంక్‌ జోరు
నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్‌, యస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, గ్రాసిమ్‌, ఐవోసీ 6-4 శాతం మధ్య పెరిగాయి. అయితే ఇండస్‌ఇండ్‌, ఐటీసీ, ఐషర్‌, ఐసీఐసీఐ, కొటక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.8-0.5 శాతం మధ్య నీరసించాయి. 

మిడ్‌ క్యాప్స్‌ అప్‌
ఉన్నట్టుండి మార్కెట్లు టర్న్‌అరౌండ్‌ కావడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. మొత్తం ట్రేడైన షేర్లలో 1323 లాభపడగా.. 1127 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం దాదాపు రూ. 771 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం మరోసారి రూ. 903 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే బుధవారం రూ. 354 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) గురువారం సైతం రూ. 1719 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');