లాభాల మార్కెట్లో ఈ షేర్లు కుదేల్‌

లాభాల మార్కెట్లో ఈ షేర్లు కుదేల్‌

తొలుత పతనంతో కుదేలైన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఉన్నట్టుండి బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. అయితే ఇంట్రాడేలో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 700 పాయింట్ల పరిధిలో ఆటుపోట్లను చవిచూసింది. కాగా.. ప్రస్తుతం సెన్సెక్స్‌ 250 పాయింట్లు జంప్‌చేసింది. అయితే కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం! దీంతో ఈ కౌంటర్లు లాభాల మార్కెట్లోనూ నష్టాలతో డీలాపడ్డాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం భారీగా పెరిగింది. జాబితాలో ఫ్యూచర్‌ రిటైల్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, సద్భావ్‌ ఇంజినీరింగ్‌, ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం..

ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో రిటైల్‌ రంగ ఈ కంపెనీ షేరు 5.5 శాతం క్షీణించింది. రూ. 392కు చేరింది. ఇంట్రాడేలో రూ. 379 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 23,700 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 2.25 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌: మౌలిక సదుపాయాల రంగ ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5.5 శాతం వెనకడుగు వేసింది. రూ. 182కు చేరింది. ఇంట్రాడేలో రూ. 167 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 6,400 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 33,200 షేర్లు ట్రేడయ్యాయి.

సద్భావ్‌ ఇంజినీరింగ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో మౌలిక సదుపాయాల రంగ ఈ షేరు 5.6 శాతం పతనమైంది. రూ. 110కు చేరింది. ఇంట్రాడేలో రూ. 109 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 36,800 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 8,350 షేర్లు ట్రేడయ్యాయి.

ఆర్బిట్‌ ఎక్స్‌పోర్ట్స్‌: నోవెల్టీ ఫ్యాబ్రిక్స్‌ తయారీ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 8 శాతం కుప్పకూలింది. రూ. 100కు చేరింది. ఇంట్రాడేలో రూ. 108 వద్ద గరిష్టాన్ని, రూ. 93 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 10,600 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 200 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి.Most Popular