నేలక్కొట్టిన బంతి.. మార్కెట్‌

నేలక్కొట్టిన బంతి.. మార్కెట్‌

ట్రేడింగ్ ప్రారంభంలోనే అమ్మకాలు ఊపందుకోవడంతో పతన బాట పట్టిన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా తిరిగి జోరందుకున్నాయి. ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడం, ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నేలక్కొట్టిన బంతిలా బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. వెరసి తొలుత 300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ ప్రస్తుతం 302 పాయింట్లు ఎగసింది. 36,775కు చేరింది. ఈ ఊపులో 36,800ను సైతం అధిగమించింది. అయితే తొలుత 36,102 వద్ద కనిష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఇది 5 నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 700 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ఇక ఉదయం ఫిబ్రవరి తదుపరి 10,700 దిగువకు చేరిన నిఫ్టీ సైతం100 పాయింట్లు జంప్‌చేసింది. ప్రస్తుతం 10,841 వద్ద ట్రేడవుతోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్‌లో అదనంగా విధించిన లెవీను  ప్రభుత్వం ఉపసంహరించనుందన్న అంచనాలు సెంటిమెంటుకు బూస్ట్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్‌, మీడియా, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ 3.7-2.7 శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో ఆటో, రియల్టీ, ఫార్మా సైతం 1.2 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. మెటల్‌ కౌంటర్లలో వేదాంతా, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా, నాల్కో, టాటా స్టీల్‌, ఎన్‌ఎండీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. పీఎస్‌యూ బ్యాంక్స్‌లో పీఎన్‌బీ, కెనరా, బీవోబీ, బీవోఐ, ఎస్‌బీఐ, యూనియన్‌, ఇండియన్‌, అలహాబాద్‌, ఓబీసీ, జేఅండ్‌కే బ్యాంక్‌ 4-1.6 శాతం మధ్య ఎగశాయి. ఇక మీడియా కౌంటర్లలో నెట్‌వర్క్‌18..11 శాతం జంప్‌చేయగా.. టీవీ 18, జీ, సన్‌ టీవీ, డిష్‌ టీవీ, డెన్‌, పీవీఆర్‌ 6.3-2.2 శాతం మధ్య పురోగమించాయి.
 
యస్‌ బ్యాంక్‌ జోరు
నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 6 శాతం లాభపడగా.. గ్రాసిమ్‌, ఓఎన్‌జీసీ, ఐబీ హౌసింగ్‌, యూపీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ 5.6-4.5 శాతం మధ్య పెరిగాయి. అయితే ఇండస్‌ఇండ్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, విప్రో, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్ 1.4-0.5 శాతం మధ్య నీరసించాయి. ఇక డెరివేటివ్‌ కౌంటర్లలో రిలయన్స్‌ కేపిటల్‌, ఐడియా, ఎన్‌బీసీసీ, బీఈఎల్‌, ఇంజినీర్స్‌, హెచ్‌పీసీఎల్‌ 9-5.5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోవైపు ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, మారికో, కజారియా, గోద్రెజ్‌ సీపీ, మదర్‌సన్‌, హావెల్స్‌, స్టార్‌ 3.4-0.8 శాతం మధ్య క్షీణించాయి. 

మిడ్‌ క్యాప్స్‌ అప్
ఉన్నట్టుండి మార్కెట్లు టర్న్‌అరౌండ్‌ కావడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1242 లాభపడగా.. 1082 నష్టాలతో కదులుతున్నాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');