కంకార్‌- కాఫీ డే.. యమస్ట్రాంగ్‌

కంకార్‌- కాఫీ డే.. యమస్ట్రాంగ్‌

విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ కంపెనీకు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో లాజిస్టిక్స్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజం కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(కంకార్‌) కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. కాగా.. మరోపక్క నాలుగు రోజులుగా అప్పర్‌ సర్క్యూట్‌లో నిలుస్తున్న కేఫ్‌ కాఫీ డే రిటైల్‌ స్టోర్ల నిర్వాహక కంపెనీ కాఫే డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

కంటెయినర్‌ కార్పొరేషన్
గ్లోబల్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా కంకార్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ప్రకటించింది. ప్రత్యేకించిన రవాణా కారిడార్‌ను ప్రారంభించడంతో కంపెనీ పనితీరు మరింత మెరుగుపడనున్నట్లు మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. దీంతో ఈ షేరుకి రూ. 566 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో కంకార్‌ షేరు 3.3 శాతం ఎగసి రూ. 498 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 510 వరకూ జంప్‌చేసింది.

Image result for cafe coffee day

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌
ఓవైపు రుణాలలో సగభాగాన్ని చెల్లించనున్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో జోరందుకున్న రిటైల్‌ కాఫీ స్టోర్ల కంపెనీ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేరు వరుసగా ఐదో రోజు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కంపెనీలో వాటా కొనుగోలు చేసేందుకు గ్లోబల్‌ దిగ్గజం కోక కోలా, ఎఫ్‌ఎంసీజీ బ్లూచిప్‌ కంపెనీ ఐటీసీ ఆసక్తితో ఉన్నట్లు వెలువడిన వార్తలు షేరుకి డిమాండ్‌ను పెంచినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గ్లోబల్‌ విలేజ్‌ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు విక్రయించడం ద్వారా లభించే నిధుల నుంచి రూ. 2,400 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు కాఫీ డే యాజమాన్యం ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో కాఫీ డే షేరు మరోసారి 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్ఈలో రూ. 3.8 లాభపడి రూ. 80 సమీపంలో ఫ్రీజయ్యింది. Most Popular