సికాల్‌ పతనం- కెన్నమెటల్‌?!

సికాల్‌ పతనం- కెన్నమెటల్‌?!

కంపెనీ దీర్ఘకాలిక రుణ సౌకర్యాలు, స్వల్పకాలిక నిధులు, తదితరాల రేటింగ్స్‌ను బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు వెల్లడించడంతో రవాణా రంగ కంపెనీ సికాల్‌ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి క్వార్టర్‌లో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ ఇంజినీరింగ్‌ దిగ్గజం కెన్నమెటల్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌ ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. ఫలితాల నేపథ్యంలో ఈ కౌంటర్‌ భారీ హెచ్చుతగ్గులను చవిచూడటం గమనార్హం. వివరాలు చూద్దాం.. 

సికాల్‌ లాజిస్టిక్స్‌
లాజిస్టిక్స్‌ రంగ కంపెనీ సికాల్‌కు చెందిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు, నిధుల సమీకరణ సౌకర్యాల రేటింగ్స్‌ను బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. సికాల్‌ లాజిస్టిక్స్‌కు గతంలో జారీ చేసిన BWR BBB+/ BWR A3+ రేటింగ్‌ను తాజాగా బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ BWR BB-/ BWR A4కు సవరించింది. దీంతో నిరాశకులోనైన ఇన్వెస్టర్లు సికాల్‌ లాజిస్టిక్స్‌ కౌంటర్లో అమ్మకాలకు క్యూకట్టారు. కొనుగోలుదారుల కరువుకావడంతో ఎన్‌ఎస్ఈలో ఈ షేరు లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. 5 శాతం పతనమై రూ. 32 వద్ద ఫ్రీజయ్యింది. 

Image result for kennametal india ltd

కెన్నమెటల్‌ ఇండియా 
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కెన్నమెటల్‌ ఇండియా లిమిటెడ్‌ రూ. 21.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 57 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 7 శాతం పెరిగి రూ. 250 కోట్లను అధిగమించింది. స్వతంత్ర డైరెక్టర్‌ బి.అంజనీ కుమార్‌ను బోర్డు చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు కెన్నమెటల్‌ ఇండియా తాజాగా పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2.2 శాతం క్షీణించి రూ. 950 వద్ద ట్రేడవుతోంది. కాగా.. తొలుత ఒక దశలో రూ. 808 వరకూ జారింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. తదుపరి రూ. 1025 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం!tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');