63 మూన్స్‌- ఒరాకిల్‌ జూమ్‌

63 మూన్స్‌- ఒరాకిల్‌ జూమ్‌

నేషనల్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఎల్‌) ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ కాకపోవడంతో 63 మూన్స్‌ టెక్నాలజీస్‌ ప్రమోటర్ల ఆస్తులను ఎటాచ్‌చేయడం సమంజసంకాదంటూ ముంబై హైకోర్టు తీర్పునిచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. డిపాజిటర్ల హక్కుల పరిరక్షణ మహారాష్ట్ర ప్రొటెక్షన్‌(ఎంపీఐడి) ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం 63 మూన్స్‌ ప్రమోటర్ల ఆస్తులను ఎటాచ్ చేసింది. రూ. 5600 కోట్ల ఎన్‌ఎస్‌ఈఎల్‌ చెల్లింపుల కుంభకోణంలో భాగంగా గతేడాది ముంబై పోలీసులు ఆస్తులను ఎటాచ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ 63 మూన్స్‌ ప్రమోటర్‌ జిగ్నేష్‌ షా వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు తాజా ఆదేశాలను జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో 63 మూన్స్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 63 మూన్స్‌ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. కొనుగోలుదారులే తప్ప అమ్మేవాళ్లు కరవుకావడంతో రూ. 10.5 ఎగసి రూ. 115.20 వద్ద ఫ్రీజయ్యింది.  కాగా.. గత మూడు రోజుల్లో ఈ షేరు 27 శాతం లాభపడటం గమనార్హం!

Related image

ఐటీ షేర్ల జోరు
ఇటీవల కొద్ది రోజులుగా బలహీనపడుతూ వస్తున్న రూపాయి మరోసారి డీలా పడింది. గతేడాది డిసెంబర్‌ తదుపరి తాజాగా 72కు పతనమైంది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నప్పటికీ ఐటీ కౌంటర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. ఐటీ కౌంటర్లలో ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సాఫ్ట్‌వేర్‌ 3.2 శాతం జంప్‌చేసి రూ. 3000 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,034 వరకూ ఎగసింది. ఈ బాటలో హెక్సావేర్‌ 2 శాతం పుంజుకుని రూ. 386 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 390 వరకూ పెరిగింది. ఇదే విధంగా మాస్టెక్‌, మైండ్‌ట్రీ, జెన్సార్‌, టీసీఎస్‌, విప్రో, టెక్‌ మహీంద్రా 2-1 శాతం మధ్య ఎగశాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');