అమ్మకాల దెబ్బ- 6 నెలల కనిష్టం

అమ్మకాల దెబ్బ- 6 నెలల కనిష్టం

ట్రేడింగ్ ప్రారంభంలోనే అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి.సెన్సెక్స్‌308 పాయింట్లు పతనమైంది. 36,165కు చేరింది. ఇది 5 నెలల కనిష్టంకాగా..  నిఫ్టీ సైతం 86 పాయింట్లకుపైగా క్షీణంచి 10,655 వద్ద ట్రేడవుతోంది. వెరసి ఫిబ్రవరి తదుపరి 10,700 దిగువకు చేరింది. ప్రపంచ ఆర్థిక మందగమన ఆందోళనలతో గురువారం యూరోపియన్‌ మార్కెట్లు నష్టపోగా.. అమెరికా స్టాక్‌ ఇండెక్సులు ఒడిదొడుకుల మధ్య మిశ్రమంగా ముగిశాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. జపాన్‌లో జులై ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్టాన్ని తాకడంతో ప్రభుత్వం సహాయక ప్యాకేజీలను పెంచే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. కాగా.. కొద్ది రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లు అమ్మకాలతో డీలాపడటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఐటీ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు 1.4-0.8 శాతం మధ్య బలహీనపడగా.. ఐటీ 1 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, సిప్లా, ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్, యాక్సిస్‌, హిందాల్కో, ఐషర్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.7-1.3 శాతం మధ్య క్షీణించాయి. అయితే టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, వేదాంతా, కోల్‌ ఇండియా, విప్రో, హీరో మోటో, టీసీఎస్‌, టెక్ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం 1.7-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. 

దివాన్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో దివాన్‌ హౌసింగ్‌, మదర్‌సన్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఈక్విటాస్‌, లుపిన్‌, బయోకాన్‌, హావెల్స్‌, పేజ్‌, టొరంట్‌ ఫార్మా 4.4-2.5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోపక్క ఒరాకిల్‌, టాటా ఎలక్సీ, హెక్సావేర్‌, మైండ్‌ట్రీ 2.3-1.25 శాతం మధ్య బలపడ్డాయి. అయితే రియల్టీ స్టాక్స్‌లో ఇండియాబుల్స్‌, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌, మహీంద్రా లైఫ్‌, డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 5-1 శాతం మధ్య నీరసించాయి. 

చిన్న షేర్లు డౌన్
మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.2 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1059 నష్టపోగా.. 306 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో సుబ్రోస్‌, డైనమిక్‌ టెక్‌, ప్రాగ్జిస్‌, సింప్లెక్స్‌, డెక్కన్‌ గోల్డ్‌, కేఈసీ, వీఎస్‌ఎస్‌ఎల్‌, అక్షర్‌ కెమ్‌, శ్రేయాస్‌, ఐఆర్‌బీ, గ్రావిటా, ఏపీఎల్‌ అపోలో, రైట్స్‌, ఐటీఐ, హింద్‌ ఆయిల్‌, హింద్‌ కాంపోజిట్స్‌, హెచ్‌ఐఎల్‌, ఐవోఎల్‌, హెచ్‌సీజీ తదితరాలు 10-6 శాతం మధ్య పతనమయ్యాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');