ప్రతికూల ఓపెనింగ్‌కే చాన్స్‌?!

ప్రతికూల ఓపెనింగ్‌కే చాన్స్‌?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు మరోసారి ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 10,410 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా.. ప్రపంచ ఆర్థిక మాంద్య ఆందోళనలతో  గురువారం యూరోపియన్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ఈ బాటలో అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. కాగా.. ఇటీవల దేశీయంగా సెంటిమెంటు బలహీనపడటంతోపాటు అమ్మకాలు కొనసాగడంతో నేడు ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

అమ్మకాల దెబ్బ
ప్రోత్సాహకర విదేశీ సంకేతాలను పెడచెవిన పెడుతూ గురువారం నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో తదుపరి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 600 పాయింట్లమేర పతనంకాగా.. నిఫ్టీ దాదాపు 200 పాయింట్లు కోల్పోయింది. వెరసి సెన్సెక్స్‌ సాంకేతికంగా కీలకమైన 37,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరగా.. నిఫ్టీ 10,800 మద్దతు స్థాయిని నిలుపుకోలేకపోయింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. చివరికి సెన్సెక్స్‌ 587 పాయింట్లు దిగజారి 36,473 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ సైతం 177 పాయింట్లు పతనమై 10,741 వద్ద ముగిసింది. 

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,670 పాయింట్ల వద్ద, తదుపరి 10,599 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 10,860 పాయింట్ల వద్ద, తదుపరి 10,979 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 26,776, 26,519 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 27,491, 27,948 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం దాదాపు రూ. 771 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గురువారం మరోసారి రూ. 903 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే బుధవారం రూ. 354 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) గురువారం సైతం రూ. 1719 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.



Most Popular