జియో పుష్‌.. హాథవే- డెన్‌ జూమ్‌

జియో పుష్‌.. హాథవే- డెన్‌ జూమ్‌

పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ జియో.. ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను ప్రారంభించనున్న నేపథ్యంలో అటు డెన్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌, ఇటు హాథవే కేబుల్‌ అండ్ డేటాకామ్ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

డెన్‌ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌
జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను ఆవిష్కరించాక ఇటీవల జోరందుకున్న డెన్‌ నెట్‌వర్క్స్‌ షేరు మరోసారి హైజంప్‌ చేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 10.5 శాతం దూసుకెళ్లి రూ. 90 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 92 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత 7 ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేరు 50 శాతం ర్యాలీ చేయడం విశేషం!  ఈ ఏడాది మొదట్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ఎంఎస్‌వో సంస్థలు హాథవే, డెన్‌, జీటీపీఎల్‌లలో వాటాలు కొనుగోలు చేసిన విషయం విదితమే. 
 
హాథవే కేబుల్‌& డేటాకామ్
 ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హాథవే కేబుల్‌&డేటాకామ్ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 35 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 18 శాతం ఎగసింది. రూ. 38.45ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేరు ఏకంగా 100 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఈ నెల 9న రూ. 19.6 వద్ద నమోదైన ఈ షేరు జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను ప్రకటించాక దూకుడు చూపుతూ వస్తోంది. 

ఏజీఎంలో
ఈ నెల 12న నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ జియో ఫైబర్‌ సర్వీసులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకే కనెక్షన్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌, టీవీ, టెలికం ల్యాండ్‌లైన్‌లతో కూడిన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దేశంలోనే అత్యంత వేగవంత డేటా సర్వీసులను అందించనున్నట్లు వివరించారు. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');