నష్టాల మార్కెట్లో ఈ షేర్లు ప్లస్‌

నష్టాల మార్కెట్లో ఈ షేర్లు ప్లస్‌

కొద్ది రోజులుగా ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి డీలాపడ్డాయి. అయినప్పటికీ కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం గమనార్హం! దీంతో ఈ కౌంటర్లు లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో టాటా గ్రూప్‌ కంపెనీ  టాటా పవర్‌, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌, ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం..

టాటా పవర్‌ కంపెనీ: విద్యుత్‌ రంగ ప్రయివేట్‌ కంపెనీ టాటా పవర్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసింది. రూ. 54.50కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 7.54 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ 4.72 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌: కేఫ్‌ కాఫీ డే రిటైల్‌ స్టోర్ల నిర్వహణ కంపెనీ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌కు వరుసగా మూడో రోజు డిమాండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. రూ. 76 వద్ద ట్రేడవుతోంది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 2.32 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ 6.74 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌: విదేశీ మాతృ సంస్థ వాటా పెంచుకున్నాక ర్యాలీ బాటలో సాగుతున్న ఈ ప్రయివేట్‌ రంగ బీమా కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3 శాతం ఎగసింది. రూ. 240 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 245 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 64,000 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 6,500 షేర్లు మాత్రమే ట్రేడయ్యాయి.

శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌: ప్రయివేట్‌ రంగ ఎన్‌బీఎఫ్‌సీ శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసింది. రూ. 1357 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో తొలుత రూ. 1300 వరకూ పతనమైంది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. తదుపరి కోలుకుని ఒక దశలో రూ. 1365 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 50 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 110 షేర్లు చేతులు మారాయి.

ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌: విద్యుత్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌ నిర్వహించే ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 2.5 శాతం లాభపడి రూ. 135 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 137 వరకూ ఎగసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 87,800 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 12,500 షేర్లు చేతులు మారాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');