పతన బాట- అడాగ్‌ షేర్లు వీక్‌

పతన బాట- అడాగ్‌ షేర్లు వీక్‌

ప్రోత్సాహకర విదేశీ సంకేతాలను పెడచెవిన పెడుతూ నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో తదుపరి అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా వెనకడుగు వేసింది. సాంకేతికంగా కీలకమైన 37,000 పాయింట్ల మార్క్‌ దిగువన 36,730 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఇక నిఫ్టీ సైతం 105 పాయింట్లు కోల్పోయి 10,813 వరకూ జారింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 289 పాయింట్లు నష్టపోయి 36,771కు చేరగా.. నిఫ్టీ సైతం 89 పాయింట్లు క్షీణించి 10,830 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా రిటైల్‌ రంగ దిగ్గజాలు వాల్‌మార్ట్‌, టార్గెట్‌, లోవ్స్‌ ఇంక్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో బుధవారం అమెరికా మార్కెట్లు జోరందుకున్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అంశంపై చర్చించినట్లు మినిట్స్‌ వెల్లడించడం కూడా ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. దేశీ మార్కెట్లలో సెంటిమెంటు బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

రియల్టీ పతనం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ 5.4 శాతం పతనంకాగా, మెటల్‌, బ్యాంక్స్‌, ఆటో 2-1 శాతం మధ్య నీరసించాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, ఐటీ రంగాలు  0.7-0.4 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌ 7 శాతం చొప్పున పతనంకాగా.. కోల్‌ ఇండియా, వేదాంతా, యూపీఎల్‌, బజాజ్‌ ఫిన్‌, బీపీసీఎల్‌, ఆర్‌ఐఎల్‌, ఇండస్‌ఇండ్‌, హీరో మోటో 4-2 శాతం మధ్య క్షీణించాయి. ఇతర బ్లూచిప్స్‌లో బ్రిటానియా, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, గెయిల్, ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్, టెక్‌ మహీంద్రా 3.3-1 శాతం మధ్య లాభపడ్డాయి.

డీఎల్‌ఎఫ్‌ కుదేల్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీ రిలయన్స్‌ కేపిటల్‌ 12 శాతం కుప్పకూలగా.. రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, దివాన్‌ హౌసింగ్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఎన్‌ఎండీసీ, అరవింద్‌ 8-4 శాతం మధ్య పతనమయ్యాయి. ఇక మరోవైపు టాటా పవర్‌ 6 శాతం జంప్‌చేయగా..  ఉజ్జీవన్, ఒరాకిల్‌, స్టార్‌, దివీస్‌, డిష్‌ టీవీ 3.4-1.5 శాతం మధ్య ఎగశాయి. కాగా.. రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌ 14 శాతం దిగజారగా.. ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, సన్‌టెక్‌, ఫీనిక్స్‌, శోభా, బ్రిగేడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 6-1.3 శాతం మధ్య నీరసించాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు పతన బాట పట్టిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.4-1.3 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1727 నష్టపోగా.. 519 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');