డీఎల్‌ఎఫ్‌ షేరు- సుప్రీం షాక్‌

డీఎల్‌ఎఫ్‌ షేరు- సుప్రీం షాక్‌

కీలక సమాచారాన్ని దాచిపెట్టిన(నాన్‌డిస్‌క్లోజర్‌) అంశంపై సుప్రీం కోర్టు నుంచి నోటీసు జారీ అయినట్లు వెలువడిన వార్తలు రియల్టీ రంగ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ కౌంటర్లో భారీ అమ్మకాలకు కారణమయ్యాయి. దీంతో ఈ షేరు తొలుత దాదాపు 20 శాతం వరకూ కుప్పకూలింది. మరోపక్క ఈ కౌంటర్‌లో ట్రేడింగ్‌ పరిమాణం సైతం భారీగా పెరిగింది. డీఎల్‌ఎఫ్‌పై గతంలో సెబీకి ఫిర్యాదు చేయడంతో పెనాల్టీ తదితర చర్యలు చేపట్టిన అంశాన్ని ఈ సందర్భంగా కేకే సిన్హా అనే పిటిషనర్‌ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు చూద్దాం..

డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌
ఇన్వెస్టర్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఎలా తొక్కిపెట్టిందీ వివరిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు రియల్టీ రంగ కంపెనీ డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌కు నోటీసు జారీ చేసినట్లు మీడియా పేర్కొంది. హర్యానాలో భారీ ల్యాండ్‌ బ్యాంకుకు సంబంధించి చేపట్టిన జ్యుడిషియల్‌ ప్రొసీడింగ్స్‌లో భాగంగా డీఎల్‌ఎఫ్‌కు నాన్‌డిస్‌క్లోజర్‌ నోటీసు జారీ అయినట్లు తెలుస్తోంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) విషయమై కంపెనీ సమాచారాన్ని దాచిపెట్టినట్లు పిటిషనర్‌ ఆరోపించారని వార్తలు వెలువడ్డాయి. కాగా.. క్విప్‌ సమాచారాన్ని పూర్తిగా వెల్లడించామని, 5-6 ఎకరాల భూమిపైనే ఫిర్యాదులున్నాయని.. ఈ భూమితో కంపెనీకి సంబంధంలేదని డీఎల్‌ఎఫ్‌ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ త్యాగి పేర్కొన్నట్లు మీడియా తెలియజేసింది.

షేరు పతనం
నాస్‌డిస్‌క్లోజర్‌పై సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసిన వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో డీఎల్‌ఎఫ్‌ షేరు 15.5 శాతం పతనమైంది. రూ. 145 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 20 శాతం వరకూ కుప్పకూలింది. రూ. 138 దిగువన సుమారు 31 నెలల కనిష్టాన్ని చవిచూసింది. ఇంతక్రితం 2017 జనవరిలో మాత్రమే డీఎల్‌ఎఫ్‌ షేరు ఈ స్థాయిలో ట్రేడయ్యింది. ట్రేడింగ్ పరిమాణం సైతం గత రెండు వారాల సగటుతో పోలిస్తే 10 రెట్లు పెరగడం గమనార్హం!tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');