ఎల్‌ఐసీ హౌసింగ్‌- ఒబెరాయ్‌ డౌన్‌

ఎల్‌ఐసీ హౌసింగ్‌- ఒబెరాయ్‌ డౌన్‌

గతంలో కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఒక ప్రధాన సంస్థ వాటా విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించడంతో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేయడంతో రియల్టీ కంపెనీ ఒబెరాయ్‌ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. దీంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. 

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 
ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో వాటా కలిగిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఫిడిలిటీ మేనేజ్‌మెంట్‌ వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. జూన్‌ చివరికల్లా ఎల్‌ఐసీ హౌసింగ్‌లో ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ 3.41 శాతం వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫ్‌ మస్కట్‌ ఇండియా ఫండ్‌ 2.28 శాతం, గవర్నమెంట్‌ పెన్షన్‌ ఫండ్‌ గ్లోబల్‌ 1.83 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. షేరుకి రూ. 425-450 సగటు ధరలో వాటా విక్రయానికి ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఆసక్తి చూపినట్లు మీడియా పేర్కొంది. ఇది 3-8 శాతం డిస్కౌంట్‌ ధరకాగా.. బ్లాక్‌డీల్స్‌ ద్వారా 3.4 కోట్ల షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇది కంపెనీ ఈక్విటీలో 6.7 శాతం వాటాకు సమానం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7.4 శాతం పతనమై రూ. 429 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 420 వరకూ జారింది. 

Image result for oberoi realty

ఒబెరాయ్‌ రియల్టీ లిమిటెడ్‌
ఆదాయపన్ను శాఖ అధికారులు కంపెనీ కార్యాలయాలలో ఈ నెల 20 నుంచీ సోదాలు(సెర్చ్‌ అండ్‌ సీజర్‌) నిర్వహిస్తున్నట్లు తాజాగా ఒబెరాయ్‌ రియల్టీ లిమిటెడ్‌ వెల్లడించింది. ఈ అంశంలో కంపెనీ ఐటీ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఒబెరాయ్‌ రియల్టీ షేరు 6 శాతం పతనమైంది. రూ. 482 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 475 వరకూ దిగజారింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');