37,000 దిగువకు.. రియల్టీ పతనం

37,000 దిగువకు.. రియల్టీ పతనం

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. తదుపరి అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్‌ 150 పాయింట్లకుపైగా వెనకడుగు వేసింది. ఫలితంగా 37,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. ఇక నిఫ్టీ సైతం 50 పాయింట్లకుపైగా క్షీణంచి 10,863 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 114 పాయింట్ల స్వల్ప వెనకడుగుతో 36,946కు చేరగా.. నిఫ్టీ సైతం 40 పాయింట్లు క్షీణించి 10,879 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా రిటైల్‌ రంగ దిగ్గజాలు వాల్‌మార్ట్‌, టార్గెట్‌, లోవ్స్‌ ఇంక్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో బుధవారం అమెరికా మార్కెట్లు జోరందుకున్నాయి. గత పాలసీ సమీక్షలో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు అంశంపై చర్చించినట్లు మినిట్స్‌ వెల్లడించడం కూడా ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. దేశీయంగా సెంటిమెంటు అంతర్గతంగా బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.

మెటల్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ(0.8 శాతం) మినహా మిగిలిన రంగాలన్నీ డీలా పడ్డాయి. ప్రధానంగా రియల్టీ 2.2 శాతం, మెటల్‌, ఐటీ, బ్యాంక్స్‌ 1.2-0.5 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 5 శాతం పతనంకాగా, వేదాంతా, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫిన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, ఇండస్‌ఇండ్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌ హిందాల్కో 2-1.3 శాతం మధ్య క్షీణించాయి. అయితే బ్రిటానియా, యూపీఎల్‌, యస్‌ బ్యాంక్‌, ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌అండ్‌టీ, ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌ 4-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. 

డీఎల్ఎఫ్ కుదేల్
డెరివేటివ్‌ కౌంటర్లలో ఎల్‌ఐసీ హౌసింగ్‌, దివాన్‌ హౌసింగ్‌, జస్ట్‌ డయల్‌, ఎక్సైడ్‌, రిలయన్స్‌ కేపిటల్‌, కేడిలా, రేమండ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా 7-2.6 శాతం మధ్య పతనంకాగా.. టాటా పవర్‌, హావెల్స్‌, జీఎంఆర్‌, ఉజ్జీవన్, బీఈఎల్‌, దివీస్‌ 2.4-1.4 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక రియల్టీ స్టాక్స్‌లో డీఎల్‌ఎఫ్‌ 13 శాతం దిగజారగా.. ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, సన్‌టెక్‌, శోభా, ఫీనిక్స్‌, ప్రెస్టేజ్‌, బ్రిగేడ్‌, మహీంద్రా లైఫ్‌ 4-0.7 శాతం మధ్య నీరసించాయి. 

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.65 శాతం చొప్పున నీరసించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 827 నష్టపోగా.. 394 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో హెచ్‌డీఐఎల్‌ 20 శాతం కుప్పకూలగా, అక్ష్‌ ఆప్టి, సీజీ పవర్‌, విష్ణు, పీసీ జ్యువెలర్స్‌, ఇండియన్‌ టెరైన్‌, సంగమ్‌, పటేల్‌, ఐబీ వెంచర్స్‌, గుల్షన్‌ పాలీ, భారత్‌ వైర్‌ తదితరాలు 18-5 శాతం మధ్య పతనమయ్యాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');