రిటైల్‌ పుష్‌- యూఎస్‌ జోష్‌

రిటైల్‌ పుష్‌- యూఎస్‌ జోష్‌

రిటైల్‌ రంగ దిగ్గజాలు ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. వినియోగ డిమాండ్‌ బలపడుతున్న సంకేతాలు దీనికి కారణంకాగా.. ఆకర్షణీయ ఫలితాలతో ఇప్పటికే వాల్‌మార్ట్‌ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా మంగళవారంనాటి నష్టాల నుంచి బయటపడిన మార్కెట్లు బుధవారం ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. డోజోన్స్ 240 పాయింట్లు(0.9 శాతం) జంప్‌చేసి 26,203కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 24 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 2,924 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ సైతం 72 పాయింట్లు(0.9 శాతం) పుంజుకుని 8,020 వద్ద స్థిరపడింది.

రేట్ల తగ్గింపుపై చర్చ
జులై చివర్లో చేపట్టిన గత పాలసీ సమీక్షలో భాగంగా ఫెడరల్‌ రిజర్వ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేట్ల తగ్గింపు అంశంపై సవివరంగా చర్చించినట్లు బుధవారం విడుదలైన మినిట్స్‌ వెల్లడించాయి. దీంతో  సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. జాక్సన్‌హోల్‌ వద్ద నేడు ప్రారంభంకానున్న కేంద్ర బ్యాంకుల సదస్సు సందర్భంగా ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ శుక్రవారం ప్రసంగించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పావెల్‌ ప్రస్తావించనున్న అంశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 

Image result for toll brothers logo

టార్గెట్‌, లోవ్స్‌ హైజంప్‌
తాజా త్రైమాసికంలో అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించడంతో లోవ్స్‌ కోస్‌ ఇంక్‌ షేరు 10.4 శాతం జంప్‌చేయగా.. ఈ ఏడాది(2019)కి ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) ఆకట్టుకోవడంతో టార్గెట్‌ కార్ప్‌ షేరు మరింత దూకుడు ప్రదర్శించింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఏకంగా 20.4 శాతం దూసుకెళ్లింది. వినియోగ డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వాల్‌మార్ట్‌, టార్గెట్, లోవ్స్‌ పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశ ఆర్థిక వ్యవస్థలో మాంద్య పరిస్థితులపై ఆందోళనలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే మరోవైపు కొత్త ఇళ్లకు డిమాండ్‌ తగ్గిన అంశాన్ని సూచిస్తూ లగ్జరీ గృహాల నిర్మాణ సంస్థ టోల్‌ బ్రదర్స్‌ ఇంక్ ఆర్డర్లు తగ్గినట్లు ప్రకటించింది. దీంతో ఈ షేరు 4.5 శాతం పతనమైంది. 

యూరప్‌ లాభాల్లో..
బుధవారం యూరోపియన్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి. ఫ్రాన్స్‌, యూకే 1.2 శాతం చొప్పున పుంజుకోగా.. జర్మనీ 1.7 శాతం ఎగసింది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. హాంకాంగ్‌, కొరియా, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా, చైనా 0.8-0.2 శాతం మధ్య క్షీణించగా.. జపాన్ 0.15 శాతం బలపడింది. మిగిలిన మార్కెట్లలో సింగపూర్‌, తైవాన్‌ నామమాత్ర లాభాలతో ట్రేడవుతున్నాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');