నేడు కూడా నేలచూపులతోనే?!

నేడు కూడా నేలచూపులతోనే?!

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు మరోసారి కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 16 పాయింట్లు క్షీణించి 10,916 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. అయితే బుధవారం అటు యూరోపియన్‌, ఇటు అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి. కాగా.. అంతర్గతంగా సెంటిమెంటు బలహీనంగా ఉన్న నేపథ్యంలో నేడు కూడా దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని విశ్లేషకులు  కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

11,000 దిగువనే!
చివర్లో అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతనంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 268 పాయింట్లు క్షీణించి 37,060 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 98 పాయింట్లు పోగొట్టుకుని 10,960 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల మార్క్‌ దిగువన ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో మూడు రోజుల ర్యాలీకి చెక్‌ పడటంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా నేలచూపులతోనే కదిలాయి.

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 10,872 పాయింట్ల వద్ద, తదుపరి 10,826 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,000 పాయింట్ల వద్ద, తదుపరి 11,081 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 27,557, 27,395 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 27,990, 28,261 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 771 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 354 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం మాత్రం ఇటు ఎఫ్‌పీఐలు రూ. 373 కోట్లు, అటు డీఐఐలు రూ. 296 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');