చివర్లో బోర్లా- 11,000 దిగువనే!

చివర్లో బోర్లా- 11,000 దిగువనే!

చివర్లో అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతనంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 268 పాయింట్లు క్షీణించి 37,060 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 98 పాయింట్లు పోగొట్టుకుని 10,960 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 11,000 పాయింట్ల మార్క్‌ దిగువన ముగిసింది. ప్రపంచ మార్కెట్లలో మూడు రోజుల ర్యాలీకి చెక్‌ పడటంతో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా నేలచూపులతోనే కదిలాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు తలెత్తవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. శుక్రవారం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ జాక్సన్‌ హోల్‌వద్ద వార్షికోత్సవ ప్రసంగం చేయనున్నారు. మరోవైపు ఫెడరల్‌ రిజర్వ్‌తోపాటు.. రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టిన గత పాలసీ సమీక్షా వివరాలు మినిట్స్‌ ద్వారా నేడు వెల్లడికానున్నాయి. 

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 3-1 శాతం మధ్య నీరసించాయి. ప్రధానంగా మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ 3-2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, ఐబీ హౌసింగ్‌, యస్‌ బ్యాంక్‌, గ్రాసిమ్‌, టాటా స్టీల్‌, గెయిల్‌, కోల్‌ ఇండియా, అల్ట్రాటెక్‌, ఇండస్‌ఇండ్‌, ఓఎన్‌జీసీ 10-3 శాతం మధ్య పతనమయ్యాయి. బ్లూచిప్స్‌లో కేవలం హీరో మోటో, మారుతీ, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌, హెచ్‌యూఎల్‌ 1.6-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. 

నెస్లే జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో సెయిల్‌, టాటా పవర్‌, రిలయన్స్‌ కేపిటల్‌, రేమండ్‌, ఎన్‌సీసీ, ఇంజినీర్స్‌ 8.5-6 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. మరోపక్క నెస్లే 6 శాతం జంప్‌చేయగా, టాటా ఎలక్సీ, బయోకాన్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, జస్ట్‌డయల్‌, కంకార్‌, బాలకృష్ణ, హెక్సావేర్‌, పీవీఆర్‌ 3-1,4 శాతం మధ్య ఎగశాయి. ఇక రియల్టీ కౌంటర్లలో.. ఇండియాబుల్స్‌, మహీంద్రా లైఫ్‌, సన్‌టెక్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌, బ్రిగేడ్‌, శోభా 5-2 శాతం మధ్య తిరోగమించాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు నష్టాల బాటలో ముగియడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1.35 శాతం చొప్పున నీరసించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1828 నష్టపోగా.. 649 మాత్రమే లాభాలతో నిలిచాయి. 

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 373 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 296 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. అయితే సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 306 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 386 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');