జోరుగా ట్రేడింగ్‌- షేర్లు పతనం

జోరుగా ట్రేడింగ్‌- షేర్లు పతనం

గత కొద్ది రోజులుగా ఒడిదొడుకుల మధ్య కన్సాలిడిషేన్‌ బాటలో కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో భారీ నష్టాలతో కళతప్పాయి. వీటిలో కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్‌ పరిమాణం సైతం జోరందుకుంది. జాబితాలో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌తోపాటు.. లాజిస్టిక్స్‌ కంపెనీ గతి లిమిటెడ్, డైరీ ప్రొడక్టుల సంస్థ పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్, వక్రంగీ లిమిటెడ్‌, కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం..

టాటా మోటార్స్‌ లిమిటెడ్‌: లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ పనితీరు మందగించిన నేపథ్యంలో కంపెనీ డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ రేటింగ్‌ను AA నుంచి AA-కు కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో టాటా మోటార్స్‌ షేరు 10 శాతం కుప్పకూలింది. రూ. 112కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 23.42 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ 40.4 లక్షల షేర్లు ట్రేడయ్యాయి.

గతి లిమిటెడ్‌: డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ రేటింగ్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరిస్తూ  కేర్‌ రేటింగ్స్‌ BBBగా ప్రకటించినట్లు లాజిస్టిక్స్‌ కంపెనీ గతి లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో గతి షేరు 4 శాతం క్షీణించింది. రూ. 40కు చేరింది. 

పరాగ్‌ మిల్క్‌ఫుడ్స్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ షేరు 12 శాతం కుప్పకూలింది. రూ. 142కు చేరింది. ఇంట్రాడేలో రూ. 140 వద్ద 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 46,400 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 47,0000 షేర్లు ట్రేడయ్యాయి.

వక్రంగీ లిమిటెడ్‌: అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు తక్కువ కావడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో వక్రంగీ లిమిటెడ్‌ షేరు 20 శాతం కుప్పకూలింది. రూ. 27.3కు చేరింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 7.89 లక్షల షేర్లుకాగా.. ఇప్పటివరకూ 10.85 లక్షల షేర్లు చేతులు మారాయి.

కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం: కొనుగోలుదారుల కంటే అమ్మేవాళ్లు అధికం కావడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 13 శాతం పడిపోయింది. రూ. 21కు చేరింది. ఇంట్రాడేలో రూ. 20 దిగువన 52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. ఈ కౌంటర్లో గత నెల రోజుల సగటు పరిమాణం 84,500 షేర్లుకాగా.. ఇప్పటివరకూ 2.6 లక్షల షేర్లు చేతులు మారాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');