కాఫీ డే రేసులో కోక కోలా.. ఐటీసీ?

కాఫీ డే రేసులో కోక కోలా.. ఐటీసీ?

కేఫ్‌ కాఫీ డే స్టోర్ల నిర్వాహక సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌లో వాటా కొనుగోలుకి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కాఫే డే ఎంటర్‌ప్రైజెస్‌ కొనుగోలుకి వీలుగా ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ, హోటల్స్‌, అగ్రి తదితర పలు బిజినెస్‌ విభాగాలు కలిగిన డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ సాధ్యాసాధ్యాల పరిశీలనను చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పానీయాల గ్లోబల్‌ దిగ్గజం కోక కోలాతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ చర్చలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి బిడ్స్‌ దాఖలుకాకపోవడం గమనార్హం. కాగా.. కాఫీ డే రేసులో తాజాగా ఐటీసీ చేరినట్లు మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం ఐటీసీ పరిశీలనదశలోనే ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేఫ్‌ కాఫీ డే మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం..

Image result for itc ltd logo

అప్పర్‌ సర్క్యూట్‌
అటు కోక కోలా, ఇటు ఐటీసీ వంటి దిగ్గజాలు వాటా కొనుగోలుకి పోటీపడుతున్న వార్తలతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్‌కు అనూహ్య డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో వరుసగా మూడో రోజు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ. 3.5 ఎగసి రూ. 72.50 వద్ద ఫ్రీజయ్యింది. ప్రమోటర్‌ సిద్ధార్ధ మరణం తదుపరి ఇటీవల పతన బాటలో సాగుతూ వచ్చిన ఈ షేరు గత వారాంతాన తొలిసారి బౌన్స్‌బ్యాక్‌ సాధించింది. 5 శాతం ఎగసి రూ. 66 సమీపంలో ముగిసింది. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐటీసీ షేరు 1.8 శాతం క్షీణించి రూ. 242 వద్ద ట్రేడవుతోంది.

Image result for coca cola logo

రుణ భారం చెల్లింపు
గత వారం రూ. 2,400 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. జులై చివరికల్లా మొత్తం గ్రూప్‌ రుణభారం రూ. 4970 కోట్లుగా నమోదుకాగా.. కాఫీ డే వాటాను రూ. 3472 కోట్లుగా తెలియజేసింది. గ్రూప్‌ రుణాలలో సగభాగాన్ని త్వరలో తిరిగి చెల్లించనున్నట్లు తెలియజేసింది. బెంగళూరులోని గ్లోబల్‌ విలేజ్‌ పార్క్‌ను పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు విక్రయించడం ద్వారా సమకూర్చుకోనున్న నిధులను ఇందుకు వినియోగించనున్నట్లు పేర్కొంది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');